టీడీపీ పార్టీ బలోపేతంలో సోషల్‌ మీడియాదే కీలక పాత్ర...!

- సోషల్ మీడియా వేదికగా పనిచెసిన చురుకైనా వ్యక్తులకు ఘనంగా సన్మానం...

On
టీడీపీ పార్టీ బలోపేతంలో సోషల్‌ మీడియాదే కీలక పాత్ర...!

తలారీ ఆంజనేయులు మరి హుసేని లను సన్మానించిన నియోజకవర్గం టిడిపి ఇంచార్జి ఎన్.రాఘవేంద్ర రెడ్డి...

న్యూస్ ఇండియా/ పెద్దకడుబూరు మండలం డిసెంబర్ 10:- టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ బలోపేతం కోసం చురుకుగా పనిచేసేందుకు సోషల్ మీడియా వేదికను ప్రవేశ పెట్టారు. సొషల్ మీడియా ద్వారా పార్టీ విజయంలో ఎవరికి ఎంత సమయం వీలైతే అంత సమయం సద్వినియోగపరిచి పార్టీని విజయ తీరాలకు చేర్చడంలో తమ వంతు పాత్ర పోషించాలని టీడీపీ ఆధిష్టానం  పేర్కొంది. కార్యకర్తలు పార్టీకి పనికొచ్చే విధంగానే పోస్టులు పెట్టాలని టీడీపీ సూచించింది. పార్టీ చేసిన మంచి పనులు, అభివృద్ధి, సంక్షేమం, పార్టీ నాయకత్వం యొక్క దూరదృష్టి, వారి విజయాలపైనే ఫోకస్ చేయాలని కోరింది. గతంలో వైసీపీ అధికారంలోకి రావడంలో సోషల్ మీడియా ప్రముఖ పాత్ర పోషించిందని, దీన్ని గమనించిన టీడీపీ అధిష్టానం పెద్ద ఎత్తున పార్టీకి ప్రచారం చేసేలా సోషల్ మీడియా టీంలను ఏర్పాటు చేసుకుంది. టీడీపీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి చాలావరకు ఈ వ్యవస్థ పనిచేసింది. ఇందులొ భాగంగానే కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలొ టిడిపి పార్టీ కోసం గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియా వేదికగా చురుకుగా టిడిపి పార్టీ బలోపేతానికి కష్టపడిన వ్యక్తులను గుర్తించి, టీడీపీ అధిష్టానం ఆదేశాల మేరకు సోషల్ మిడియాలొ పనిచేసిన వారిని ఘనంగా సన్మాణించె కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దకడబూరు మండలానికి చెందిన టీడీపీ బిసి నాయకుడు తలారీ ఆంజనేయులు మరియు మేకడోనా గ్రామం హుసేని లను మంత్రాలయం నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి రాఘవేందర్ రెడ్డి ఆధ్వరంలో వారిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. పార్టీ కోసం పని చేయడంలో ఈ టీంలు కొంత వరకు సక్సెస్ అయినట్టే. అలాగే టీడీపీ పార్టీ బలోపేతం కోసం తమ వంతుగా కష్టపడిన విరికి టీడీపీ నేతలు భవిషత్ లో ఏదైనా పదవితో దారి చూపిస్తారో లేదో వేచి చూడాలి...IMG_20241211_071922

Views: 34
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..!  పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..! 
వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు వై. ప్రదీప్ రెడ్డిని కలిసిన పెద్దకడుబూరు వైసీపీ నాయకులు.
పాల్వంచలోని విద్యా సంస్థల అధినేత కేఎల్ఆర్ చిరస్మరణీయుడు
పద్మ శ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే
#Draft: Add కూటమితోనే అభివృద్ధి సాధ్యం: ఆలూరు టీడీపీ ఇన్ఛార్జిYour Title
ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస..
కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం - జగనన్న 2.0 ఏంటో మేము చూపిస్తాం... ఎమ్మెల్యే వై. బాలనాగి రెడ్డి.
పెద్దకడుబూరు : మహనీయుని స్మరణలో ఘనంగా వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు..!