నాలుగు రోజులు బ్యాంకు సేవలు రద్దు 

APGVB బ్యాంకు TGB బ్యాంకు లో విలీనం 

On
నాలుగు రోజులు బ్యాంకు సేవలు రద్దు 

వివరాలు వెల్లడించిన రీజినల్ మేనేజర్ ఉదయ్

కొత్తగూడెం (న్యూస్ ఇండియా నరేష్)డిసెంబర్ 20: APGVB సేవలు ఈనెల 28 నుంచి 31 వరకు నాలుగు రోజులు బ్యాంకు లావాదేవీలు రద్దు చేస్తున్నట్లుగా రీజనల్ మేనేజర్ ముక్తాపురం ఉదయ్ శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  ఏపీజీవీబీ  బ్యాంకును తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం చేస్తున్నట్లుగా తెలిపారు. తెలంగాణలోని 493 ఏపీజీవిబి శాఖలను తెలంగాణ గ్రామీణ బ్యాంకు (TGB) లో విలీనం  చేస్తున్నట్టుగా తెలిపారు. కావున యూపీఐ, ఏటీఎం, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొదలగు సేవలు అందుబాటులో ఉండవని తెలిపారు. ఏపీజీవిబీ ఖాతాదారులు ఎవరైనా ఈనెల 27 తేదీ వరకు సేవలు ఉపయోగించుకోవచ్చు అన్నారు. 1-1- 2025 నుంచి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పేరుతో తిరిగి సేవలు కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మేనేజర్ సుధీర్ పాల్గొన్నారు.

Views: 138
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ  సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ
ఖమ్మం నవంబర్ 12 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) చదువులోనే కాదు సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ ముందడుగు వేస్తోంది. పిల్లలకు చదువుతోపాటు సేవ చేసే...
ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..
నిమోనియాను నివారిద్దాం..
తెలంగాణలో తెలుగుదేశంపార్టీ పూర్వ వైభవానికి వనమా వాసు కృషీ
ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...
ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ
ఘనంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుక