విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలి

చుంచుపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని  తనిఖీ చేసిన డిఎస్పి 

On
విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలి

కొత్తగూడెం (న్యూస్ ఇండియా నరేష్) డిసెంబర్ 27:  సబ్ డివిజన్ పరిధిలోని చుంచుపల్లి సర్కిల్ ఆఫీస్ ను శుక్రవారం కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రెహమాన్  తనిఖీ చేసారు. సర్కిల్ ఆఫీస్ ఆవరణలో మొదటగా మొక్కని నాటారు.సర్కిల్ ఆఫీస్ లో  సిబ్బందితో మాట్లాడి వారికి కేటాయించబడిన విధులు అడిగి తెలుసుకున్నారు.సరైన పద్ధతిలో రికార్డుల నిర్వహణ, నమోదైన కేసుల వివరాలు సిసిటిఎన్ఎస్ లో పొందుపరచాలన్నారు. పెండింగ్ గ్రేవ్ కేసులపై సమీక్ష చేసారు.వాటికి గల కారణాలు తెలుసుకున్నారు.త్వరితగతిన వాటిని పూర్తి చేయాలనీ సూచించారు. నమోదైన సైబర్ నేరాల గురించి తెలుసుకున్నారు. విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.సర్కిల్ ఆఫీస్ పరిధిలోని అన్నీ గ్రామాలకు గ్రామ పోలీసు అధికారులను కేటాయించాలని ఆదేశించారు.రికార్డుల నిర్వహణ,ఈ సాక్ష్య అప్లికేషన్ ఉపయోగించే విధానం,  సీసీటీఎన్ఎస్, కోర్టు డ్యూటీ,పెండింగ్  సమన్లు,వారెంట్లు మొదలుగు వాటిని తనిఖీ చేశారు. సిబ్బంది అందరికీ నిజాయితీ, క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరని పనిచేయాలని తెలిపారు.  సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో దర్యాప్తు జరిగిన కేసుల ప్రస్తుత స్థితిగతులపై గ్రేవ్ కేసుల్లో నిందితుల అరెస్టు దర్యాప్తు జరుగుతున్న తీరు గంజాయి మరియు సైబర్ నేరాలు దర్యాప్తు తీరును అడిగి తెలుసుకోవడంతో పాటు ఇతర గ్రేవ్ కేసుల వివరాలకు సంబంధించిన రికార్డులను డిఎస్పి పరిశీలించారు.చుంచుపల్లి సర్కిల్ పరిధిలోని పోలీసు అధికారులతో డిఎస్పీ మాట్లాడుతూ శాంతిభద్రతల విషయంలో పోలీసు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని నేరాల కట్టడి కోసం అధికారులు సమిష్టిగా సమన్వయముతో మరింత శ్రమించడంతోపాటు నేరం జరిగిన వెంటనే అధికారులు వేగంగా స్పందించాలని చట్టాలను అధిక్రమించే చర్యలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితులలోను వదలొద్దని సర్కిల్ ఆఫీస్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో  ఏం జరుగుతుందని ఎప్పటికప్పుడు పరిశీలించడంతోపాటు ముందస్తు సమాచార సేకరణ అవసరమని క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ ఓపిక సహనంతో ప్రజలు ఇచ్చే ఫిర్యాదులను పరిశీలించాలని డిఎస్పి తెలిపారు.త్వరలో గ్రామపంచాయతీ ఎలక్షన్లు ఉన్నందువలన ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాలను సందర్శించి  ఆ గ్రామాలలో ఉన్న రౌడీలు మరియు సస్పెక్ట్స్ లను, గుర్తించి ముందస్తు సమాచారం సేకరించి రాబోవు ఎలక్షన్లకు తయారీగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో చుంచుపల్లి సిఐ ఆర్.వెంకటేశ్వర్లు ,సర్కిల్ ఎస్సైలు రమణారెడ్డి, రవికుమార్, రమాదేవి ట్రైనీ ఎస్సై అఖిల మరియు సర్కిల్ ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Views: 37
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

మర్రి"తో "మాచన" అనుభందం... మర్రి"తో "మాచన" అనుభందం...
"మర్రి"తో "మాచన" అనుభందం  "మర్రి చెన్నారెడ్డి" లో శిక్షణ అనుభవం.. రంగారెడ్డి జిల్లా, ఫిబ్రవరి 15, (న్యూస్ ఇండియా ప్రతినిధి): పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్...
ధాన్యం సేకరణ ఓ క్రతువు..
దాహార్తిని తీర్చండి
మినీ మేడారం జాతరకు  ప్రత్యేక బస్సు
డొమెస్టిక్ సిలిండర్లు హోటళ్ళ లో ఎలా ఉన్నాయ్..
ఘనంగా 49వ సింగరేణి హై స్కూల్ వార్షికోత్సవం 
రేషన్ అక్రమార్కులపై పి డి యాక్ట్ ఖాయం..