నకిలీ రిపోర్టర్ల పై చర్యలు తీసుకోవాలి

జిల్లా ఎస్పీ రోహిత్ రాజుకి కొత్తగూడెం జర్నలిస్టుల వినతి

On
నకిలీ రిపోర్టర్ల పై చర్యలు తీసుకోవాలి

భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియన్ నరేష్ ) డిసెంబర్ 30: జిల్లాలో రిపోర్టర్లమంటూ చలామణి అవుతున్న నకిలీలపై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా ఎస్పీ రోహిత్ రాజు కి కొత్తగూడెం జర్నలిస్టులు సోమవారం వినతి పత్రాన్ని అందజేశారు.ఇటీవల కాలంలో జిల్లా కేంద్రమైన కొత్తగూడెంతో పాటు ఇతర ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు యూట్యూబ్, పిడిఎఫ్,నాన్ రికగ్నైజ్డ్ పత్రికలు వంటి సామాజిక మాధ్యమాలను అడ్డుపెట్టుకొని రిపోర్టర్లంటూ ముసుగు ధరించి తిరుగుతూ వ్యాపారస్తులు,కాంట్రాక్టర్లు,సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న వారి పట్ల దృష్టి సారించి కఠినమైన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు జిల్లా ఎస్పీని కోరారు.అదేవిధంగా జిల్లా ప్రెస్ క్లబ్ పేరుతో ఈ నకిలీ విలేకరులు వసూళ్ల పర్వానికి తెరలేపినట్లు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సానుకూలంగా స్పందిస్తూ.. ఇకపై నకిలీ రిపోర్టర్ల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు.నిజమైన జర్నలిస్టులు ఆధారపురితంగా అవినీతి,అక్రమాలపై వార్తా కథనాలు ప్రచురించి సమాజానికి మేలు చేసేవారని,కానీ కొందరు నకిలీ జర్నలిస్టుల వల్ల అసలైన జర్నలిస్టులకు చెడ్డ పేరు వస్తుందని అన్నారు. ఇకపై ఎవరైనా అనుమతి లేని యూట్యూబ్, పిడిఎఫ్, నాన్ రికగ్నైజ్డ్ పత్రికల పేర్లతో సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ హెచ్చరికలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు ఇమంది ఉదయ్ కుమార్,పండుగ రేశ్వంత్,చావా పాపారావు,దాట్ల రవీందర్ నరసింహారావు,ఉదయ్ కుమార్ తదితరులు ఉన్నారు.

Views: 28
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు
ఖమ్మం మార్చి 2 ఖమ్మం న్యూస్ ప్రతినిది: ఖమ్మం నగరంలోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల వేదికగా జిల్లా స్థాయి యువ పార్లమెంట్ పోటీలు అత్యంత ఉత్సాహభరితంగా...
చంద్రగ్రహణం సందర్భంగా రేపు పెద్దమ్మ గుడి మూసివేత
మన్నెగూడలోని ఎస్ఆర్ హ్యాచరీస్ పై రైతుల ఆగ్రహం..
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన నీరుకొండ ఉషారాణి
అభినవ్ హై స్కూల్ లో ఘనంగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ (SLC),హై స్కూల్ సైన్స్ ఎక్సపో
వనంవారి కృష్ణాపురం గ్రామ గర్వకారణం ఏటుకూరి మునేశ్వరావు
కుమ్మెర ఘటన నిందితులకు ఉరిశిక్ష విధించాలి: సీపీఎం డిమాండ్..