9 మంది పేకటరాయుళ్లు అరెస్ట్...

చెడు అలవాట్లకు అలవాటు పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

On
9 మంది పేకటరాయుళ్లు అరెస్ట్...

9 మంది పేకాటరాయిలు అరెస్ట్..

రంగారెడ్డి జిల్లా, జనవరి 29, (న్యూస్ ఇండియా ప్రతినిధి):- ఓ ఫామ్ హౌస్ లో గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న పేకాట స్థావరంపై ఎస్ఓటి బృందం దాడులు నిర్వహించి, 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా, యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో యాచారం మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామ శివారులో 9 మంది కలిసి పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారంతో మహేశ్వరం ఎస్ఓటి బృందం, స్థానిక పోలీసులతో దాడులు నిర్వహించారు. ఇందులో పట్టుబడిన 9 మంది వ్యక్తులు అదుపులోకి తీసుకొని విచారించి అనంతరం తదుపరి విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ కు తరలించారు. వీరి వద్ద నుండి రూ.71,990/- నగదు, 9 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు ఎండి సుల్తాన్ (ఇబ్రహీంపట్నం), జుట్టు శ్రీశైలం (యాచారం), కటికిరెడ్డి బాల్ రెడ్డి (నాదర్గుల్), రాసురి కృష్ణ (రాయిపోల్), కోడి యాదగిరి (ఇబ్రహీంపట్నం), ఆకుల సురేష్ (ఇబ్రహింపట్నం) శ్రీనివాస్ (ఇబ్రహింపట్నం), వాసం రామ్ లక్ష్మణ్ (ఇబ్రహింపట్నం), బర్ల కుమార్ (ఇబ్రహింపట్నం) గా పోలీసులు గుర్తించారు. పేకాటరాయుల నుండి 71 వేల నగదు, 9 ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రాత్రికి రాత్రే స్టేషన్ బెయిల్ ఇచ్చినట్టు సమాచారం. చెడు అలవాట్లకు అలవాటు పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

IMG-20250129-WA0315
9 మంది పేకాటరాయిలు అరెస్ట్..
Views: 1

About The Author

Post Comment

Comment List

Latest News

మర్రి"తో "మాచన" అనుభందం... మర్రి"తో "మాచన" అనుభందం...
"మర్రి"తో "మాచన" అనుభందం  "మర్రి చెన్నారెడ్డి" లో శిక్షణ అనుభవం.. రంగారెడ్డి జిల్లా, ఫిబ్రవరి 15, (న్యూస్ ఇండియా ప్రతినిధి): పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్...
ధాన్యం సేకరణ ఓ క్రతువు..
దాహార్తిని తీర్చండి
మినీ మేడారం జాతరకు  ప్రత్యేక బస్సు
డొమెస్టిక్ సిలిండర్లు హోటళ్ళ లో ఎలా ఉన్నాయ్..
ఘనంగా 49వ సింగరేణి హై స్కూల్ వార్షికోత్సవం 
రేషన్ అక్రమార్కులపై పి డి యాక్ట్ ఖాయం..