మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన - నెహ్రూ యువ కేంద్ర

On
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన - నెహ్రూ యువ కేంద్ర

ఖమ్మం జిల్లా నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో, కేసీఆర్ నగర్ యూత్ క్లబ్ వారు అమరవీరుల రోజు ( మహాత్మా గాంధీ గారి వర్ధంతి) ఖమ్మం ప్రభుత్వ మహిళ డిగ్రీ కాలేజ్ నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూత్ అసోసియేషన్ నాయకులు మురళీకృష్ణ, సయ్యద్ షారుక్ ఇమ్రాన్, ప్రిన్సిపల్ డా.జి.పద్మావతి, ఎన్ ఎస్ ఎస్ పీఓలు రామకుమార స్వామి, శ్యామలదేవి గాంధీ గారి చిత్రపటానికి ముందుగా పూలమాల వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత యువతకు మహాత్మా గాంధీ గారి జీవితాన్ని గురించి వివరించి ఆయన లాగా గొప్ప స్థాయికి యువత కూడా వెళ్లాలని ప్రోత్సహిస్తూ వారితో వ్యాసరచనలు, ఉపన్యాస పోటీలు నిర్వహించి వారికి బహుమతులు ఇవ్వడం జరిగింది. మరియు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించి అందులో భాగంగా కారో య మరో, జహా ప్రేమ్ హై - వహీ జీవన్ హై, సత్ ఎక్ హై - మార్గ్ హై కహి, మేరా జీవాన్ హై - మేరా సందేశ్ హై, మొదలగు నినాదాలతో అక్కడి ప్రజలకు అవగాహన ఇస్తూ ర్యాలీతో గాంధీ చౌక్ లోని గాంధీ విగ్రహం వద్దకు చేరుకొని అక్కడి పరిసరాలను శుభ్రం చేసి పూలమాల వేయడం జరిగింది.

Views: 2
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

మర్రి"తో "మాచన" అనుభందం... మర్రి"తో "మాచన" అనుభందం...
"మర్రి"తో "మాచన" అనుభందం  "మర్రి చెన్నారెడ్డి" లో శిక్షణ అనుభవం.. రంగారెడ్డి జిల్లా, ఫిబ్రవరి 15, (న్యూస్ ఇండియా ప్రతినిధి): పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్...
ధాన్యం సేకరణ ఓ క్రతువు..
దాహార్తిని తీర్చండి
మినీ మేడారం జాతరకు  ప్రత్యేక బస్సు
డొమెస్టిక్ సిలిండర్లు హోటళ్ళ లో ఎలా ఉన్నాయ్..
ఘనంగా 49వ సింగరేణి హై స్కూల్ వార్షికోత్సవం 
రేషన్ అక్రమార్కులపై పి డి యాక్ట్ ఖాయం..