అభినందన సంచిక గురు సత్కారం

*రామచంద్రామృతం* అనే పేరుతో సావనీర్ ఆవిష్కరణ కార్యక్రమం

On
అభినందన సంచిక గురు సత్కారం

సత్కారం అందుకున్న భుజేoధర్

IMG-20250203-WA0086ఆదివారం రోజున యాదాద్రి జిల్లా ఆలేరు పట్టణంలోని ఓ వేడుకల మందిరంలో కవి సౌజన్య,వ్యాసాల వ్యాసుడు, మహా ఉపాధ్యాయుడు డాక్టర్ లింగంపల్లి రామచంద్ర 80 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా *రామచంద్రామృతం* అనే పేరుతో సావనీర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా బమ్మెర గ్రామవాసి శ్రీ పోతన సాహిత్య కళావేదిక అధ్యక్షుడు మాన్యపు భుజేoదర్ ను గురువర్యులు, డాక్టర్ లింగంపల్లి రామచంద్ర దంపతులు, మరియు డాక్టర్ నందిని సిద్ధారెడ్డి శాలువాతో సన్మానించి రామచంద్ర అమృతం పుస్తకం, జ్ఞాపికతో సత్కరించారు. గురు సత్కారం అందుకున్నందుకు బుజేందర్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ పోరెడ్డి రంగయ్య సమన్వయకర్తగా వ్యవహరించారు. సభా అధ్యక్షత డాక్టర్ నందిని సిద్ధారెడ్డి వహించారు. ముఖ్య అతిథులుగా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, కుడుదుల నాగేష్, మాజీమంత్రి మోత్కుపల్లి నరసింహులు, ఆచార్య బన్న ఐలయ్య, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి నామోజు బాలా చారి, జనగామ, యాదాద్రి కవులు, రామచంద్ర సార్ శిష్యులు, తదితరులు పాల్గొన్నారు.

Views: 43
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

తొర్రూరులో గుడుంబాపై పోలీసుల దాడులు తొర్రూరులో గుడుంబాపై పోలీసుల దాడులు
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు, ఆగస్టు 13: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం భీముని తండాలో గుడుంబా తయారీ, విక్రయాలపై తొర్రూరు పోలీసులు దాడులు నిర్వహించారు. గురువారం తెల్లవారుజామున...
అంబర్‌పేట్‌లో 20 క్వింటాళ్ల  పీడీఎస్ బియ్యం స్వాధీనం..
మాకు ఈ టీచర్ వద్దు.. మా పిల్లల భవిష్యత్తును కాపాడండి
కార్పొరేట్ విధానాలను నిరసిస్తూ జైలు భరో
కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై సీపీఐ ప్రజా చైతన్య ప్రచార యాత్ర
ఏపీ ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం..
ప్రీ ఎయిమ్ కిడ్స్ స్కూల్‌లో ఘనంగా బోనాల సంబరాలు