ఘనంగా ప్రారంభమైన పోలీస్ అన్యువల్ గేమ్స్ స్పోర్ట్స్ మీట్ 

ప్రారంభించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు 

On

భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ఇండియాబ్యూరోనరేష్) ఫిబ్రవరి 6: జిల్లా పోలీసుల అన్యువల్ గేమ్స్ స్పోర్ట్స్ మీట్ 2025 ను హేమచంద్రపురం  హెడ్ క్వార్టర్స్ నందు గురువారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పతక ఆవిష్కరణ చేసి ఘనంగా ప్రారంభించారు. జిల్లాలోని సబ్ డివిజన్ కు చెందిన డార్ హెడ్ క్వార్టర్స్, కొత్తగూడెం, ఇల్లెందు, పాల్వంచ, భద్రాచలం, మణుగూరు, డిపిఓ అండ్ స్పెషల్ వింగ్స్, హోంగార్డ్స్ వింగ్స్, విభాగాల కు చెందిన స్పోర్ట్స్ జట్లు నుండి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు గౌరవ వందనం స్వీకరించారు. శాంతి పావురాలను ఎగురవేసి, జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం సిబ్బందితో స్పోర్ట్స్ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..ఈ స్పోర్ట్స్ మీట్ మూడు రోజుల పాటు 6,7, 8 తేదీ లా పాటు నిర్వహించినట్లు తెలిపారు. స్నేహపూర్వ వాతావరణం లో ఆటలు కొనసాగించాలని కోరారు. గెలుపు ఓటములు సహజమని అన్నారు. ఈ గేమ్స్ వల్ల పనిలో ఒత్తిడిని తగ్గించుకోవచ్చన్నారు. మానసికంగా, ఆరోగ్యంగా మన ఫిట్నెస్ ని పొందవచ్చు అన్నారు. పాల్వంచ మరియు హోంగార్డ్స్ వాలీబాల్ పోటీని ఎస్పీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పి  విక్రత్ కుమార్ సింగ్ , డిఎస్పి అబ్దుల్ రెహమాన్, చంద్రబాను, సతీష్, రవీందర్ రెడ్డి, సిఐలు ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు

Views: 1
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వీక్లీ పెరేడ్.  ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వీక్లీ పెరేడ్.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జూన్ 14, న్యూస్ ఇండియా : క్రమశిక్షణతో విధులు నిర్వహించి,  జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని, పోలీస్ శాఖలో...
క్రొత్త కలెక్టర్ 'ప్రావీణ్యం' చుపునా!!!
ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు
ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు
ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు
*ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు*
రక్తదానం మహాదానం