యువత స్వయం ఉపాధి రంగాల్లో ముందుండాలి...
టీ పార్క్ ప్రారంభోత్సవం లో పాల్గొన్న ఎమ్మెల్సి నవీన్ రెడ్డి..
యువత స్వయం ఉపాధి రంగాల్లో ముందుండాలి..
టీ పార్క్ ప్రారంభోత్సవం లో పాల్గొన్న ఎమ్మెల్సి నవీన్ రెడ్డి..
రంగారెడ్డి జిల్లా, ఫిబ్రవరి 24 (న్యూస్ ఇండియా ప్రతినిధి): యువత స్వయం ఉపాధి రంగాల్లో ముందుండాలని ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి అన్నారు.రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిధిలోని ఉమ్మడి చేగూర్ గ్రామానికి చెందిన మొగిలిగిద్ద సురేష్ గౌడ్, అన్నారం నర్సిమ,నూతనంగా ఏర్పాటు చేసిన టీ పార్క్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి హాజరయ్యారు. హాజరైన ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డిని టీ పార్క్ యాజమాన్యం సాదరంగా ఆహ్వానించి సన్మానించగా ఎమ్మెల్సీ టీ పార్కును ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా నాగరకుంట నవీన్ రెడ్డి మాట్లాడుతూ టీ పార్క్ యాజమాన్యానికి అభినందనలు తెలుపుతూ స్వయం ఉపాధి ద్వారా వ్యాపార రంగంలో మరింత అభివృద్ధి చెంది ఆర్థిక అభివృద్ధి దిశగా అడుగులు వేసి వ్యాపారాన్ని మరింతగా విస్తృతం చేయాలని, వ్యాపారంలో ఓపిక, స్వచ్ఛత ద్వారా వ్యాపార రంగంలో రాణించాలని టీ పార్క్ యాజమాన్యానికి శుభాకాంక్షల ద్వారా సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ పిఎసిఎస్ చైర్మన్ విట్టల్, పిఎసిఎస్ చైర్మన్ గొర్లపల్లి అశోక్, మాజీ సర్పంచ్లు గోవింద్ అశోక్ జెట్ట కుమార్, రాజు, నాయకులు, సాములయ్య, మంచనపల్లి శ్రీనివాస్ గౌడ్, నర్సపగూడ భూపాల్, రమేష్, జాలగూడెం శ్రీశైలం, వీర్లపల్లి పాండు, కూతురు బుచ్చయ్య, బండ నర్సింలు, జెట్ట కుమార్ (RK), బండి రమేష్, జెట్ట మహేందర్, బండ కుమార్, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Comment List