మాన్యపు భుజేoదర్ కు జాతీయ సాహితీ ప్రతిభ పురస్కారం
కవి, కళాకారుడు పోతన సాహిత్యకళా వేదిక అధ్యక్షులు
మాన్యపు భుజేoదర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రక్కన అల్లూరి సీత రామరాజు జిల్లా లోని ఎటపాక రాజ్ పాల్ ఇంజనిరింగ్ కళాశాల లో ఆదివారం రోజున అంతర్జాతీయ శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో భద్రాద్రి కవితోత్సవం జాతీయ పండుగను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఆంధ్రాలోని అల్లూరి సీతారామరాజు జిల్లాల సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగానిర్వహించారు. శ్రీశ్రీ కళావేదిక 144వ అంతర్జాతీయ శతాధిక కవి సమ్మేళనం లో జనగామ జిల్లా బమ్మర గ్రామవాసి కవి, కళాకారుడు పోతన సాహిత్య కళా వేదిక అధ్యక్షులు మాన్యపు భుజేoదర్ పాల్గొని నవ సమాజ నిర్మాణానికై నే వెలుగు రేఖనై పల్లవిస్తాను అనే కవితను చదవగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ కత్తిమoడ ప్రతాప్, జాతీయ అధ్యక్షురాలు చిట్టె లలిత, జాతీయ కన్వీనర్ కొల్లి రామావతి, ప్రముఖ తెలంగాణ కవి తాళ్లూరి పంచాక్షరయ్య, రాజ్ పాల్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ వరలక్ష్మి, భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు, శ్రీ శ్రీ కళావేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి టి పార్థసారథి, భద్రాచలం ఎస్పి ప్రీతం మేడం,మొదలగు పెద్దల చేతుల మీదుగా జాతీయ సాహితీ ప్రతిభా పురస్కారం భుజేoదర్ అందుకున్నారు. ప్రశంసా పత్రం, మెమెంటో, పూలదండ, శాలువాతో ఘనంగా భుజేoదర్ ను సన్మానించి సత్కరించారు. ఈ జాతీయ కవి సమ్మేళనానికి ఆంధ్ర, తెలంగాణ,ఒరిస్సా, ఛత్తీస్గడ్ రాష్ట్రాలకు చెందిన కవులు సాహితీవేత్తలు పాల్గొన్నారు. జాతీయ సాహితీ ప్రతిభా పురస్కారం అందుకున్నందుకు భుజేందర్ ను పలువురు కవులు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసి ప్రశంసించారు.
Comment List