షాద్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్లేట్ల లొల్లి...
లక్షలు పెట్టి విద్యార్థులకు అన్నదానం చేస్తుంటే 50 రూ. ప్లేట్ల పంచాయతీ ఏంటో..

షాద్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్లేట్ల లొల్లి..
ప్లేటు గ్లాసు తిరిగి ఇవ్వకుంటే డబ్బులు చెల్లించండని హుకుం జారీ చేసిన ప్రిన్సిపల్..
NOC ఇవ్వాలంటే ప్రతి విద్యార్థి 50 రూపాయలు చెల్లించాలి..
విద్యార్థుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్న జూనియర్ కళాశాల సిబ్బంది..
లక్షలు పెట్టి విద్యార్థులకు అన్నదానం చేస్తుంటే 50 రూ. ప్లేట్ల పంచాయతీ ఏంటో..
రంగారెడ్డి జిల్లా, ఫిబ్రవరి 27 (న్యూస్ ఇండియా ప్రతినిధి):- షాద్ నగర్ పరీక్షలు దగ్గర పడుతున్నాయి వచ్చే నెల మార్చి 5,6 తేదీలలో ఇంటర్మీడియట్ పరీక్షలు మొదలుకానున్నాయి. ఈ ఏడాది కొత్త నిబంధనలతో ఇంటర్ వార్షిక పరీక్షల హాల్‌టికెట్లను ఆయా కళాశాలల లాగిన్లలో ఉంచామని ఇంటర్‌బోర్డు తెలిపింది. విద్యార్థులు కళాశాలల నుంచి హాల్‌టికెట్లను తీసుకోవాలని బోర్డు కార్యదర్శి కృష్ణఆదిత్య ఇప్పటికే సూచించారు.ఇంతవరకు బాగానే ఉంది షాద్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సిబ్బంది హాల్ టికెట్ల విషయంలో కొత్త నిబంధనలకు తెరతీశారు గత డిసెంబర్ నెలలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఔదార్యంతో దూరప్రాంతాల నుంచి చదువుకోడానికి వచ్చే పిల్లలకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు అదేవిధంగా పిల్లలు తినడానికి ప్లేట్లను గ్లాసులను కూడా ఆయననే అందివ్వడం జరిగింది అయితే జూనియర్ కళాశాలలో దాదాపు 800 మంది విద్యార్థు ఉండగా 600 ప్లేట్లు మాత్రమే పిల్లలకు పంచడం జరిగింది. అసలు విషయానికి వస్తే ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలంటే కాలేజీ వెబ్ సైట్ లోనే చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి విద్యార్థుల నుండి ఎన్ఓసి సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు. అది దేనికో ఒకసారి చూద్దాం ఎన్ఓసి సర్టిఫికెట్ జారీ చేయాలంటే మీరు తీసుకున్న ప్లేటు గ్లాసు కళాశాలకు తిరిగి ఇవ్వాలని ప్రిన్సిపల్ నిబంధన విధించాడు.800 మంది విద్యార్థులకు గాను పంచింది 600 ప్లేట్లు అయితే మిగిలిన రెండు వందల మంది విద్యార్థులు అసలు ప్లేటు గ్లాసులు తీసుకోలేదని చెప్తున్నారు. ప్లేట్లు గ్లాసులు తిరిగి ఇవ్వలేని విద్యార్థులు ప్రతి ఒక్కరు 50 రూపాయలు చెల్లించాలని హుకుం జారీ చేశారు. దీంతో విద్యార్థులు చేసేదిలేక 50 రూపాయలు చెల్లించి ఎన్ఓసి సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే శంకర్ మధ్యాహ్న భోజనం ప్రారంభించిన రోజు ప్లేట్లు పంచిన సమయంలో ఏ ఏ విద్యార్థికి ఇచ్చామన్న కనీస సమాచారం కాలేజీ సిబ్బంది దగ్గర లేకపోవడం గమనార్హం ఇచ్చే ముందు విద్యార్థి పేరు రాసుకొని ఇవ్వాలన్న కనీస ఆలోచన లేకపోవడంతో ఇప్పుడేమో ప్లేటు గ్లాసు ఇస్తేనే ఎన్వోసీ ఇస్తామనడంతో పిల్లలు అయోమయంలో పడ్డారు. కొందరు పిల్లలు ఇక్కడ మేము భోజనం చేయలేదు ప్లేటు గ్లాసు తీసుకోలేదు మొర్రో అని నెత్తి నోరు మొత్తుకుంటున్న కాలేజీ సిబ్బంది వినడం లేదని అంటున్నారు. ఈ విషయమై కాలేజ్ ప్రిన్సిపల్ సర్వేశ్వర్ రెడ్డిని వివరణ త్వరగా అలాంటిదేంలేదు కాలేజీకి వచ్చిన ప్రతి విద్యార్థి తీసుకున్నారు అడిగితే ఇప్పుడేమో లేవని చెప్తున్నారు. అందుకే ఇస్తే ప్లేట్లు ఇవ్వండి లేదంటే 50 రూపాయలు చెల్లించండి అని వారిని భయపెట్టడానికి మాత్రమే చెప్పడం జరిగిందని ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదని చెప్తూనే విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు పంచిన రోజు వారి వివరాలు తీసుకోకపోవడం వాస్తవమే కానీ కొత్త విద్యా సంవత్సరంలో వచ్చే పిల్లలకు ఇబ్బంది కలగకుండా ఇలా చేయవలసి వచ్చింది అని వివరణ ఇచ్చాడు. ప్లేటు గ్లాసు ఇవ్వని ప్రతి విద్యార్థి దగ్గర 50 రూపాయలు ఎలా వసూలు చేస్తారు అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం దాటవేస్తున్నారు. కానీ కాలేజ్ సిబ్బంది మాత్రం ప్రతి విద్యార్థి దగ్గర డబ్బులు తీసుకుంటూ దొరికిపోవడం వాస్తవం ఎందుకు తీసుకుంటున్నారని వారిని అడిగితే ప్రిన్సిపల్ డబ్బులు తీసుకోమన్నాడు అందుకే తీసుకుంటున్నాం అని సమాధానం ఇస్తున్నారు. పిల్లలు ఇస్తున్న మాట వాస్తవం సిబ్బంది తీసుకుంటున్న మాట వాస్తవం ఇలా నిరుపేద విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తూ కాలేజీ సిబ్బంది డబ్బులు వసూలు చేయడం ఎంతవరకు సమంజసమో వారికే తెలియాలి పేద పిల్లలకు విద్యను అందించాల్సిన ప్రభుత్వ జూనియర్ కళాశాలలె ఇలా వ్యవహరిస్తే మా పరిస్థితి ఏంటని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comment List