రేషన్ బియ్యం దందా చేస్తే పి.డి యాక్ట్ కేసులు ఖాయం
పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డి.టి. మాచన రఘునందన్..
రేషన్ బియ్యం దందా చేస్తే పి.డి యాక్ట్ కేసులు ఖాయం...
పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డి.టి. మాచన రఘునందన్
నల్లగొండ జిల్లా, మార్చి 03 (న్యూస్ ఇండియా ప్రతినిధి):- రేషన్ బియ్యం దందా చేస్తే ఎంతటి వారినైనా వదిలి పెట్టే ప్రసక్తే లేదని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్ హెచ్చరించారు. సోమవారం

ఆయన చింతపల్లి లో రహస్యంగా దాచి ఉంచిన రేషన్ బియ్యం నిల్వల గుట్టురట్టు చేశారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసే వారిపై పి.డి యాక్ట్ ప్రకారం కేసులు పెట్టడం ఖాయం అని రఘునందన్ హెచ్చరించారు. సుమారు 30 క్వింటాళ్ల రేషన్ బియ్యం నిల్వల ను స్వాధీనం చేసుకుని పౌర సరఫరాల సంస్థ గిడ్డంగి కి తరలించారు. రేషన్ బియ్యం ను తూకం చేసే ఎలక్ట్రానిక్ కాంట ను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు కొట్టే వెంకటేష్, చింతపల్లి పోలీసులు పాల్గొన్నారు.
Comment List