తమిళనాడులో వర్షం

On

తమిళనాడులో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఎన్నోకాలనీలు జలదిగ్భందంలో చిక్కుకోవడంతో.. జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దంచి కొడుతున్న వర్షాలతో రోడ్లు జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. ఇళ్లలోని నిత్యావసర వస్తువులు నీటిలో తడిసిపోవడంతో జనం అల్లాడిపోతున్నారు. భారీ వర్షాలతో స్కూల్స్‌, కాలేజీలు మూతపడ్డాయి. ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. పలుచోట్ల సబ్‌వేలు మూసివేశారు. ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. మోటార్లతో రోడ్లపై నిలిచిన నీటిని తోడేస్తున్నారు. భారీ వర్షాలకు ప్రాజెక్టులు […]

తమిళనాడులో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఎన్నోకాలనీలు జలదిగ్భందంలో చిక్కుకోవడంతో.. జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

దంచి కొడుతున్న వర్షాలతో రోడ్లు జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. ఇళ్లలోని నిత్యావసర వస్తువులు నీటిలో తడిసిపోవడంతో జనం అల్లాడిపోతున్నారు.

భారీ వర్షాలతో స్కూల్స్‌, కాలేజీలు మూతపడ్డాయి. ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. పలుచోట్ల సబ్‌వేలు మూసివేశారు.

ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. మోటార్లతో రోడ్లపై నిలిచిన నీటిని తోడేస్తున్నారు. భారీ వర్షాలకు ప్రాజెక్టులు సైతం నిండుకుండల్లా మారాయి.

దీంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. చెన్నై, కాంచీపురం, చెంగల్‌పేట, తిరువళ్లూరు సహా పలు జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ కొనసాగుతుంది.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో రూ. 1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు సీఎం జగన్ బుధవారం వ‌ర్చువ‌ల్‌గా శంకుస్థాపన చేశారు. వీటిద్వారా 21,079 మందికి ఉపాధి లభిస్తుంది....
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే
ఎంపీ వద్దిరాజు నాగుల్ మీరా దర్గా సందర్శన
ఘనంగా బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ