శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కి ప్రత్యేక పూజలు..
ఏ.వి.జి ఫౌండేషన్ చైర్మన్ ఆడాల గణేష్..

శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కి ప్రత్యేక పూజలు..
ఏ.వి.జి ఫౌండేషన్ చైర్మన్ ఆడాల గణేష్..

*రంగారెడ్డి జిల్లా, ఏప్రిల్ 18, న్యూస్ ఇండియా ప్రతినిధి:* రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి నక్కర్త గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దర్శన నిమిత్తం ఏ.వి.జి ఫౌండేషన్ చైర్మన్ ఆడాల గణేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన ఆహ్వానం మేరకు హైదరాబాద్ గ్రీన్ ఫార్మసిటీ పోలీస్ స్టేషన్ సీఐ లిక్కీ కృష్ణంరాజు, ఎస్సై తేజం రెడ్డి, శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ లిక్కి కృష్ణంరాజు మాట్లాడుతూ.. మేడిపల్లి నక్కర్త గ్రామానికి నాకు ఎనలేని అనుబంధం ఉందని మా పోలీస్ స్టేషన్ తరపున నా సహాయ సహకారాలు ఎల్లవేళలా శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారికి ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. ఇంత మంచి దర్శన భాగ్యాన్ని కలిగించిన ఎ.వి.జి ఫౌండేషన్ చైర్మన్ ఆడాల గణేష్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పూజారి దర్శన్, గ్రామస్తులు మక్కపల్లి మధుకర్, మక్కపల్లి సుధాకర్, కాశమల్ల శివకుమార్, సంగం రాకేష్, పర్వతాలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
Related Posts
Post Comment
Latest News

Comment List