నిందితులకు న్యాయస్థానం ముందు శిక్ష పడినప్పుడే, ప్రజలలో పోలీసులపై నమ్మకం పెరుగుతుంది.

యన్.బి.డబ్ల్యూ ఎగ్జిక్యూషన్ పై దృష్టి సారించాలి.. ఎన్.డి.పి.యస్ కేసులలో నిందితులకు తప్పనిసరిగా శిక్ష పడేలా చూడాలి.. కోర్టు డ్యూటీ అధికారులకు పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.

On
నిందితులకు న్యాయస్థానం ముందు శిక్ష పడినప్పుడే, ప్రజలలో పోలీసులపై నమ్మకం పెరుగుతుంది.

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 10, న్యూస్ ఇండియా : కోర్ట్ డ్యూటీ అధికారులు ఇటు పోలీసు శాఖకు, అటు న్యాయ శాఖకు వారధిగా ఉంటూ కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ నందు జిల్లాను మొదటి వరుసలో ఉంచాలని జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ అన్నారు. తేది: 10.05.2025 నాడు, జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం, కోర్టు డ్యూటీ అధికారులతో ఎస్పీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి కేసులో నిందితులకు శిక్ష పడే విధంగా చూడాలని, తప్పు చేసిన వారు చట్టం నుండి తప్పించుకోవడానికి వీలులేదని, న్యాయస్థానం ముందు నిందితులకు శిక్ష పడినప్పుడే, ప్రజలలో పోలీసులపై నమ్మకం పెరుగుతుంది అన్నారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఎగ్జిక్యూట్ చేయాలని అన్నారు. ముఖ్యంగా ఎన్.డి.పి.యస్ కేసులలో నిందితులకు తప్పనిసరిగా శిక్ష పడేలా చూడాలని అన్నారు. సైబర్ నేరాలకు సంభందించి హోల్డ్ చేయబడిన డబ్బులు బాధితులకు అందేవిధంగా సంభందిత బ్యాంక్ లకు ఆదేశాలు జారీ చేసేవిధంగా చూడాలని అన్నారు. ఈ నెల 14వ తేది వరకు జరగనున్న స్పెషల్ లోక్ అదాలత్ నందు రాజి కుదుర్చుకోవడానికి అవకాశం ఉన్న అన్నీ కేసులలో కక్షిదారులు రాజీ కుదుర్చుకునేల చూడాలని అన్నారు. ఈ సమావేశం నందు అదనపు ఎస్పీ కే శ్రీనివాస్ రావ్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, కోర్ట్ లైజనింగ్ అధికారి సత్యనారాయణ, డీసీఆర్బీ సిబ్బంది, కోర్ట్ డ్యూటీ అధికారులు తదితరులు ఉన్నారు.WhatsApp Image 2025-05-10 at 5.23.25 PM

Views: 2
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
ఖమ్మం డిసెంబర్ 4 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ మనుమరాలు,గాంధీ పెద్ద కుమారుడు ప్రశాంత్ కుమార్ ఏకైక కూతురు...
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి
రాములు తండా గ్రామపంచాయతీలో సర్పంచ్ ఏకగ్రీవం.సర్పంచ్ గా బానోత్ వెంకట్రాం
ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్
రాజ్యాంగం దినోత్సవం
అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటాం: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
డాక్టరేట్ రావడంతో బాధ్యత మరింత పెరిగింది : వాసవి కళాశాల ప్రిన్సిపాల్ డా. మాదారం విక్రమ్ గౌడ్..