సమాజ హిత "విజయ"గర్వం...

సమాజ హితం కోరే సైనికుడు  నా కొడుకు:మాచన విజయ...

On
సమాజ హిత

సమాజ హిత "విజయ"గర్వం 

సమాజ హితం కోరే సైనికుడు 
నా కొడుకు:మాచన విజయ 

IMG-20250510-WA0548
సమాజ హితం కోరే సైనికుడు  నా కొడుకు:మాచన విజయ..

మే రెండవ ఆదివారం
(ప్రపంచ మాతృ దినోత్సవం)

అతడు సామాన్యుడే, కానీ యుద్ధ స్పూర్తి ఉన్న ఓ *సైనికుడు*
సామాన్యుల్లో.. అసామాన్యుడు. అరుదైన అధికారి.ఇన్ని చెప్పినా..ఎన్ని చెప్పినా.. ఒక "వన్ మ్యాన్ మిషన్" అంటే నే బాగుంటుంది.సమాజ హిత కాంక్ష తో..పొగాకు పై 22 ఏళ్లుగా యుద్ధం చేస్తున్న ఓ సాదా సీదా వ్యక్తి మాచన రఘునందన్.
ఈ వ్యక్తి తపన , కసి,కృషి, సమాజ హిత కాంక్ష మొత్తంగా.. యువత పొగాకు, ధూమపానం అలవాట్లకు గురి కాకుండా.. పొగాకు నియంత్రణ కోసం యుద్దం చేసే  సైనికుడిగా తీర్చిదిద్దింది తల్లి ప్రోత్సాహం...

Read More ఎట్టకేలకు లింగంపల్లి 'ఫ్లై ఓవర్' ప్రారంభం.


తన కొడుకు ను పొగాకు పై యుద్ధ చేసేలా ప్రేరణ శక్తి ఇచ్చిన 
మాతృమూర్తి "మాచన విజయ"

Read More శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!

ప్రపంచ మాతృ దినోత్సవం సందర్భంగా..
"అమ్మ" ఇంటర్"వ్యూ"..

Read More సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.

హైదరాబాద్, మే 10, న్యూస్ ఇండియా ప్రతినిధి: శత్రుదేశం నుంచి,ఉగ్రవాదుల నుంచి దేశాన్ని కాపాడుతున్నది సుశిక్షితులైన సైనికులు, ఐతే..సమాజ హితం కోసం తన కొడుకు ను సుశిక్షితున్ని చేసింది ఓ మాతృమూర్తి. పొగాకు బారి న పడి యువత పిట్టల్లా రాలి పోకుండా..
తన తనయున్ని పొగాకు పై పోరాడే సైనికుడి గా తీర్చి దిద్దింది.
యువకులు చెడు అలవాట్లకు లోను కాకుండా, ముఖ్యంగా పొగాకు, పొగాకు ఉత్పత్తుల బారి న పడి నిర్వీర్యం కాకుండా..అలుపెరుగని, విశ్రామమెరుగని నిరంతర పోరాటం చేస్తున్నారు మాచన విజయ కొడుకు *మాచన రఘునందన్* 
శత్రు దేశం తో భారత సైనికులు పోరాడుతున్న వేళ , యువత ఆరోగ్యం పై అమానుష దాడి చేస్తున్న పొగాకు పై 22 ఏళ్లుగా యుద్ధం చేస్తున్న నా కొడుకు ఓ సైనికుడే అని 
"విజయ"గర్వం వ్యక్త పరిచారు. పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత మాచన రఘునందన్ మాతృ మూర్తి విజయ. ప్రపంచ మాతృ దినోత్సవం సందర్భంగా.. యువత ను ఉద్దేశించి మాచన విజయ మా(బా)టలు
ఓ..అసాధారణ శ్రమ , సమాజ హిత తపన కు తన తనయుడు నడుం బిగించడం పట్ల..
"ఇంత కన్నా నా కేం కావాలి" 
సమాజం మెచ్చే,నచ్చే పని చేస్తున్నపుడు.
"నిరుత్సాహ పడకు గో.. ఎహెడ్" అని ప్రోత్సహించి 
ధైర్యాన్ని మించిన ఆత్మ స్థయిర్యాన్ని,పోరాట స్ఫూర్తిని అస్త్ర, శస్త్రాలుగా పుత్రుడి కి అందించాను. అని విజయ గర్వం వ్యక్తం చేశారు మాచన విజయ. తెలిసీ తెలియని వయసులో పొగాకు ధూమపానం అలవాట్ల కు లోనై బంగారం వంటి ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్న యువత ను ఒక్కొక్క రిని పలకరించి తమ్ముడు సిగరెట్ మానేస్తే అమ్మ సంతోషిస్తుంది.అంటూ మాటే మంత్రం గా.. వేలాది మంది యువత ను పొగాకు కు బలి కాకుండా నియంత్రిస్తున్నారు మాచన రఘునందన్..
"పొగాకు నియంత్రణ" కు 22 ఏళ్లుగా అసాధారణమైన కృషి చేస్తున్నారు వృత్తి రీత్యా పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాశిల్దార్ గా ఉద్యోగం చేస్తూనే..యుద్ధ స్పూర్తి తో..
పొగాకు పై యుద్ధం చేస్తున్నారు.
భారత దేశం కోసం సరిహద్దు లో సైనికులు ఎలా..అయితే ఉగ్రవాదులతో.. శత్రువు ల తో అలుపెరుగని పోరాటం చేస్తారో..అదే మాదిరి.
ఓ సాదా సీదా వ్యక్తి తన అమూల్య సమయం వెచ్చించి పొగాకు,పొగాకు ఉత్పత్తుల బారి నుంచి విద్యార్ధులను,యువతను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.ఉద్యోగం చేస్తూ.. ఓ నాలుగు రాళ్లు వెనకేసుకుందాం. అనే యావ కు దూరం గా..ఉండే అధికారి ఉంటారు అంటే ఆశ్చర్య పొనక్కరలేదు. ఉన్నారు..ఆయనే మాచన రఘునందన్.

ఇరవై ఏళ్లుగా..పొగాకు నియంత్రణ కు అలుపెరుగకుండా నిర్విరామకృషి చేస్తున్న మాచన రఘునందన్.. పొగాకు, ధూమపానం అలవాట్ల వల్ల కలిగే క్యాన్సర్, టి.బి ల తో ఎంతో మంది ప్రభావితులవుతున్నారని,ఎన్నో కుటుంబాలు ఛిద్రం అవుతున్నాయని, యువత తెలిసో తెలియకో గుట్కా , బీడీ, సిగరెట్ కు అలవాటు అయ్యి,ఆతర్వాత పొగాకు మహమ్మారి వల్ల రకరకాల జబ్బు ల కు గురవుతున్నారని రఘునందన్ ఆవేదన వ్యక్తం చేస్తారు.ఏ కారణం చేత నైనా పొగాకు ఉత్పత్తుల వినియోగం తో లక్షలాది కుటుంబాలు దారుణంగా కష్ట నష్టాలకు గురవుతున్న దరిమిలా..చికిత్స కంటే నివారణ ముఖ్యం అని ప్రచారం చేస్తున్న "మాచన" ను టాటా ట్రస్ట్ కొనియాడింది.అటు ఉద్యోగం చేస్తూ.. ఇటు పొగాకు పై ఏళ్లుగా యుద్ధం చేస్తున్న రఘునందన్ కృషి ని మరింత ప్రోత్సహిస్తూ..చేయూత నిచ్చే అవకాశం ఉంది.యావత్ భారత దేశ వ్యాప్తంగా పొగాకు నియంత్రణ కోసం ఎలా కృషి చేస్తే బావుంటుంది.ముఖ్యంగా యువత ను, విద్యార్ధుల ను పొగాకు ఉత్పత్తులను వినియోగిoచకుండా వారిని నొప్పించకుండా మెప్పించేలా..తన దైన శైలిలో కృషి చేస్తున్న రఘునందన్ తెలంగాణ లో "ఔరా..ఇది సాధ్యమా.?!" అనుకునే రీతిలో గొప్ప మార్పు తీసుకువస్తున్నారు.ఇందుకు గాను ఇప్పటికే రఘునందన్ కు అంతర్జాతీయ గుర్తింపు రాగా..ఇపుడు తాజాగా టాటా మెమోరియల్, టాటా ట్రస్ట్ లు రఘునందన్ కు జాతీయ స్థాయిలో అవకాశం ఇచ్చి ప్రోత్సహిస్తున్నాయి.పంజాబ్ లోని చండీఘర్ లో ఉన్న రిసోర్స్ సెంటర్ ఫర్ టుబాకో కంట్రోల్ వారు "మాచన" కు పొగాకు నియంత్రణ లో ప్రత్యేక శిక్షణ ఇచ్చి పట్టా ను అందజేశారు.

Views: 2

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

సమాజ హిత "విజయ"గర్వం... సమాజ హిత "విజయ"గర్వం...
సమాజ హిత "విజయ"గర్వం  సమాజ హితం కోరే సైనికుడు నా కొడుకు:మాచన విజయ  సమాజ హితం కోరే సైనికుడు  నా కొడుకు:మాచన విజయ.. మే రెండవ ఆదివారం(ప్రపంచ...
జిల్లాలో బాలికల, విద్యార్థినిల, మహిళల కు ‘సంగారెడ్డి జిల్లా పోలీసు షీ-టీమ్స్ రక్షణ’.
నిందితులకు న్యాయస్థానం ముందు శిక్ష పడినప్పుడే, ప్రజలలో పోలీసులపై నమ్మకం పెరుగుతుంది.
ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు