ఓఆర్ఆర్ ఫై ఘోర రోడ్డు ప్రమాదం..

ఇనుప రెలింగ్ ను ఢీ కొట్టిన కారు.. వ్యక్తి మృతి..

On
ఓఆర్ఆర్ ఫై ఘోర రోడ్డు ప్రమాదం..

ఓఆర్ఆర్ ఫై ఘోర రోడ్డు ప్రమాదం..

ఇనుప రెలింగ్ ను ఢీ కొట్టిన కారు.. వ్యక్తి మృతి..

IMG-20250519-WA0435
ఇనుప రెలింగ్ ను ఢీ కొట్టిన కారు.. వ్యక్తి మృతి..

రంగారెడ్డి జిల్లా, మే 19, న్యూస్ ఇండియా ప్రతినిధి: ఇబ్రహీంపట్నం ఓఆర్ఆర్ ఫై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం... రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిభట్ల మున్సిపాలిటీ బొంగ్లూర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ -12 వద్ద హైదరాబాద్ ఈసీఎల్ నాగారం దత్త కాలనీ కి చెందిన ఎస్ కె. హిలాల్ (35) కారు లో అతి వేగంగా వచ్చి సైడ్ ఇనుప డివైడర్ ను ఢీ కొట్టాడు. ఆ ఇనుప డివైడర్ కారు ముందు అద్దంలో నుంచి దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న హిలాల్ అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో సమాచారం అందుకున్న ఆదిభట్ల పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Views: 83

About The Author

Post Comment

Comment List

Latest News