రాజీవ్ హత్య కేసులో మరో ట్విస్ట్

On

భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో ఆరుగురు దోషులను విడుదల చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం సవాలు చేసింది. సుప్రీంకోర్టులోనే పిటిషన్ వేసింది. దోషులకు ఉపశమనం కల్పిస్తూ జారీ చేసిన ఆదేశాలను సుప్రీంకోర్ట్ సమీక్షించాలని కోరింది. దోషులను విడుదల చేయడంపై వాదనలు వినిపించేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. తగిన వాదనలు కూడా వినిపించే అవకాశం ఇవ్వకుండా దోషులను విడుదల చేయడమంటే.. సహజ న్యాయ సూత్రాల ఉల్లంఘన జరిగినట్టు అంగీకరించడమే అవుతుందని కేంద్రం వ్యాఖ్యానించింది. […]

భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో ఆరుగురు దోషులను విడుదల చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం సవాలు చేసింది.

సుప్రీంకోర్టులోనే పిటిషన్ వేసింది. దోషులకు ఉపశమనం కల్పిస్తూ జారీ చేసిన ఆదేశాలను సుప్రీంకోర్ట్ సమీక్షించాలని కోరింది.

దోషులను విడుదల చేయడంపై వాదనలు వినిపించేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది.

తగిన వాదనలు కూడా వినిపించే అవకాశం ఇవ్వకుండా దోషులను విడుదల చేయడమంటే.. సహజ న్యాయ సూత్రాల ఉల్లంఘన జరిగినట్టు

అంగీకరించడమే అవుతుందని కేంద్రం వ్యాఖ్యానించింది. న్యాయాన్ని నీరుగార్చినట్టేనని పేర్కొంది.

కాగా రాజీవ్ హత్య కేసులో జీవితకాల శిక్ష అనుభవిస్తున్న ఆరుగురు దోషులు- నళిని, మురుగన్, సంథాను, రాబర్డ్ పయాస్, జయకుమార్‌లకు జైలు విముక్తి కల్పిస్తూ గతవారమే సుప్రీంకోర్ట్ ఆదేశాలిచ్చింది.

ఇతర ఏ కేసుల్లోనూ అవసరం లేకుంటే దోషులందరినీ విడుదల చేయవచ్చునని పేర్కొంది. దాంతో దాదాపు 30 ఏళ్ల తర్వాత దోషులంతా జైలు నుంచి విడుదలయ్యారు.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి.. నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి..
ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్ ఆటోనగర్, సర్వే నంబర్–38లో అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి త్రవ్వకాలు చేపడుతున్న నమిశ్రీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ సంస్థపై తక్షణ...
సూర్యతండ గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భుక్యా సక్రి మంగీలాల్
సాతానిగూడెం గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా రెడ్యానాయక్
వెంకటాపురం గ్రామాన్ని ఆదర్శ  గ్రామంగా తీర్చిదిద్దుతాం*
ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ ను పరామర్శించిన మంత్రి తుమ్మల
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి 
ఉప్పలచాలక గ్రామ సర్పంచిగా గెలుపొందిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శారద చందు