15 మంది ఏ.ఎస్ఐ లకు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా పదోన్నతి.

On
15 మంది ఏ.ఎస్ఐ లకు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా పదోన్నతి.

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 26, న్యూస్ ఇండియా : సంగారెడ్డి జిల్లాకు చెందిన 15 మంది ఏ.ఎస్ఐ లకు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా పదోన్నతి కల్పించిన మల్టీ జోన్- II, ఐజి, శ్రీ వి.సత్యనారాయణ ఐపియస్ కల్పించారు. పదోన్నతి పొందిన ఎస్ఐ లను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపియస్ అభినందించిన అభినందించారు. 1990లో పోలీసు కానిస్టేబుల్ గా నియామకమై గడిచిన 35 సంవత్సరాలుగా ఉమ్మడి మెదక్ జిల్లా పోలీసుశాఖలో విశిష్ట సేవలందించిన, ప్రస్తుత సంగారెడ్డి జిల్లాకు చెందిన 15-మంది ఏ.ఎస్ఐ లకు ఎస్ఐ లుగా పదోన్నతి కలిస్తూ గౌరవ మల్టీ జోన్- II ఐజి వి.సత్యనారాయణ ఐపియస్ ఉత్తర్వులు వెలువరిచారని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపియస్ తెలియజేశారు.  ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గత 35 సంవత్సరాలకు పైగా పోలీసు శాఖలో విధులు నిర్వహించి, సుధీర్గ సర్వీస్ లో ఎలాంటి రిమార్క్ లేకుండా సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా పదోన్నతి పొందడం జరిగిందని, పదోన్నతి పొందిన అధికారులు కే.గంగయ్య, కే.సుధాకర్, శ్రీహరి, సంజీవ రెడ్డి, షాబుర్ రహేమాన్, యం.లక్ష్మీనారాయణ, దుర్గయ్య, జి. నారాయణ, వై.మల్లేశ్వర్, జి.బిక్షపతి. లను జిల్లా ఎస్పీ గారు అభినందించి, ఎస్ఐ ర్యాంక్ చిహ్నంను అలకరించి శుభాకాంక్షలు తెలియజేశారు. పదోన్నతి ద్వారా స్థాయితో పాటు బాధ్యత మరింత పెరుగుతుందని, పెరిగిన బాధ్యతను క్రమశిక్షణతో నిర్వర్తిస్తూ.. ప్రజలలో పోలీస్ శాఖ పట్ల ఉన్న నమ్మకాన్ని, గౌరవాన్ని మరింతగా పెంచే విధంగా కృషి చేస్తూ.., సర్వీసులో మరిన్ని ఉత్తమ సేవలను అందించి రాష్ట్ర పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి, రోజు వ్యాయామం చేస్తూ.., ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడే ఎలాంటి విధులనైనా సమర్దవంతంగా నిర్వహించగలమని, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపగలం అన్నారు. మానసికంగా శారీరకంగా ఒత్తిడిని దూరం చేయడానికి శారీరక శ్రమ, యోగా అవసరమని ఎస్పీ అన్నారు.WhatsApp Image 2025-05-26 at 3.05.40 PM

Views: 10
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు
ఖమ్మం మార్చి 2 ఖమ్మం న్యూస్ ప్రతినిది: ఖమ్మం నగరంలోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల వేదికగా జిల్లా స్థాయి యువ పార్లమెంట్ పోటీలు అత్యంత ఉత్సాహభరితంగా...
చంద్రగ్రహణం సందర్భంగా రేపు పెద్దమ్మ గుడి మూసివేత
మన్నెగూడలోని ఎస్ఆర్ హ్యాచరీస్ పై రైతుల ఆగ్రహం..
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన నీరుకొండ ఉషారాణి
అభినవ్ హై స్కూల్ లో ఘనంగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ (SLC),హై స్కూల్ సైన్స్ ఎక్సపో
వనంవారి కృష్ణాపురం గ్రామ గర్వకారణం ఏటుకూరి మునేశ్వరావు
కుమ్మెర ఘటన నిందితులకు ఉరిశిక్ష విధించాలి: సీపీఎం డిమాండ్..