‘కలెక్టర్ కార్యాలయం’ పేరు దుర్వినియోగం.

On
‘కలెక్టర్ కార్యాలయం’ పేరు దుర్వినియోగం.

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 30, న్యూస్ ఇండియా : కలెక్టరేట్ కార్యాలయం పేరుతొ అక్రమంగా మొరం తరలిస్తు యథేచ్ఛగా, విచ్చల విడిగా పదుల సంఖ్యలో లోడ్ ను అమ్ముకొంటు ప్రకృతి వనరులు కొల్లగొట్టుతు దుండగులు సొమ్ము చేసుకొంటున్న ఘటన సంగారెడ్డి పట్టణంలో పట్టపగలే వెలుగులోకి వచ్చింది. సంగారెడ్డి అర్ డి ఓ కార్యాలయం, మండల కార్యాలయం, నీటిపారుదల కార్యాలయాలకు అతిసమీపంలో ఎలాంటి భయభక్తులు లేకుండా యథేచ్ఛగా  ట్రక్ అద్దం పై 'ఆన్ గోవేర్నమేంట్ డ్యూటీ కలెక్టరేట్ ఆఫీస్' అని ఆంగ్లంలో ఏ-3 సైజు పేపర్ పై ముద్రించి ఆ పత్రాన్ని ట్రక్ డ్రైవర్ కేబిన్ లోపలినుండి అతికించి, చూసే ప్రతి ఒక్కరికి స్పష్టంగా కనిపించే విధంగా ఏర్పాటు చేసుకొని ఈ దోపిడీ కొనసాగుతుంది. ఈ వైనం చూస్తుంటే టీఎస్ 08 యుఈ 3543 నంబర్ కల ఆ ట్రక్ డ్రైవర్ కానీ, యజమానికి కానీ పోలీసులు, రవాణాశాఖ ల పట్ల ఏమాత్రం భయం లేక పోవడం చాల ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది. ఈ విదంగా అక్రమ మార్గంలో వ్యాపారం చేస్తున్నారంటే 'సిగ్గు' తో తలదించుకోవలసింది ఎవరు? ఏ శాఖా సిబ్బంది? అని అక్కడి స్థానికులు సంధిస్తున్న ప్రశ్నలకు జిల్లా యంత్రాంగమే జవాబు చెప్పాలి. యథావిధిగా విచారణ పేరిట ఈ విషయాన్నీ ములన పడేసి, "నింపాదిగా విచారణ చెయ్యొచ్చు" అనే సాకు తో నిర్వీర్యం చేసి 'మమ' అని చేతులు దులుపుకొని, మరుగున పడెయ్యడం ఖాయం అని, జిల్లా అధికారులకు ఇది షరామామూలే అంటు అక్కడి స్థానికులు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు! ఏదేమైనప్పటికీ 'ఆన్ గోవేర్నమేంట్ డ్యూటీ కలెక్టరేట్ ఆఫీస్' అని ఆంగ్లంలో ఏ-3 సైజు పేపర్ పై ముద్రించి ఆ పత్రాన్ని వాడుకొని అని జిల్లా కలెక్టర్ కార్యాలయం పరువును బజార్ కు ఈడుస్తున్నారనేది కాదనలేని నిజం. అక్రమాలను సక్రమాలుగా చూపించి, అడ్డదారిని అవకాశంగా మలుచుకొనే విధంగా సహాయపడుతున్న ఆ అధికారులెవరు? వారిని వెతికి పట్టుకొని వారిపై చర్యలు తీసుకోవలసిన బాధ్యత స్వయంగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి పై ఎంతైనా వుంది. తగిన విదంగా చర్యలు తీసుకొంటారా? లేదా పట్టించుకోకుండా వదిలేస్తారా? వేచి చూడవలసిందే.WhatsApp Image 2025-05-30 at 6.36.40 PM

Views: 148
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..!  పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..! 
వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు వై. ప్రదీప్ రెడ్డిని కలిసిన పెద్దకడుబూరు వైసీపీ నాయకులు.
పాల్వంచలోని విద్యా సంస్థల అధినేత కేఎల్ఆర్ చిరస్మరణీయుడు
పద్మ శ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే
#Draft: Add కూటమితోనే అభివృద్ధి సాధ్యం: ఆలూరు టీడీపీ ఇన్ఛార్జిYour Title
ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస..
కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం - జగనన్న 2.0 ఏంటో మేము చూపిస్తాం... ఎమ్మెల్యే వై. బాలనాగి రెడ్డి.
పెద్దకడుబూరు : మహనీయుని స్మరణలో ఘనంగా వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు..!