సామాజిక తెలంగాణ నిర్మాణమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం: కొడకండ్ల మండలానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు**

On

 

Read More ఆపదలో ఆపన్నహస్తం....!!

 

పాలకుర్తి నియోజకవర్గంలోని కొడకండ్ల మండలానికి తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేసిన సందర్భంగా NSUI నాయకులు, కాంగ్రెస్ పార్టీవారితో పాటు మండల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, ఈ నిర్ణయం ద్వారా మండల విద్యారంగ అభివృద్ధికి కొత్త దారులు తెరుచుకుపోతాయని అభిప్రాయపడ్డారు.

 

ఈ సందర్భంగా NSUI పాలకుర్తి నియోజకవర్గ అధ్యక్షులు దేశగాని హరిగోపాల్ గౌడ్ మాట్లాడుతూ, “గత ప్రభుత్వాలు కొడకండ్లను రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించాయి. కానీ నేడు ఝాన్సీ యశస్విని రెడ్డి గారు అభివృద్ధికి నాంది పలికారు. ఈ స్కూల్ మంజూరు వారు చేసిన గొప్ప పని. ప్రజల అవసరాలకు స్పందించిన ప్రజాప్రభుత్వం నిజమైన అర్థాన్ని నిరూపిస్తోంది” అని అన్నారు.

కొడకండ్ల మండల సీనియర్ నాయకులు కీసర సునీల్ రెడ్డి మాట్లాడుతూ, “ఈ స్కూల్ వల్ల మండలంలోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి రానుంది. ఇది విద్యా రంగంలో ఒక మైలురాయి” అని పేర్కొన్నారు.

ధర్మారపు బిక్షపతి మాట్లాడుతూ, “మునుపటి పాలకులు ఈ ప్రాంతాన్ని ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారు. కానీ ఇప్పుడు అభివృద్ధికి పట్టం కడుతున్న నాయకత్వం దర్శనమిస్తోంది” అని తెలిపారు.

 

NSUI నాయకుడు గిరగాని కార్తీక్ గౌడ్ మాట్లాడుతూ, “ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీ విద్యార్థులకు సమానవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం. సమగ్ర అభివృద్ధికి ఇది పెద్ద బలంగా నిలవనుంది” అని చెప్పారు. IMG-20250530-WA0130 కార్యక్రమంలో NSUI, యువజన కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ధర్మారపు బిక్షపతి, కీసర సునీల్ రెడ్డి, భూక్య వీరియా నాయక్, ఐతరాజు రాజు, గూగులోతు నరసింహ నాయక్, పొడి శెట్టి వెంకన్న, సోమవారపు శ్రీకాంత్, గూగులోతు సతీష్, కునుసోతు యాకన్న, ననుబాల ప్రశాంత్ యాదవ్, ఇస్లావత్ సురేష్, పవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Views: 12
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్: డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...
ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం
ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు
మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..