సిపిఎస్ వద్దు.. ఓపిఎస్ ముద్దు..

ఎన్ ఓ పి ఆర్ యూ ఎఫ్  దక్షిణ భారత ఇంచార్జీ మాచన రఘునందన్..

On
సిపిఎస్ వద్దు.. ఓపిఎస్ ముద్దు..

సిపిఎస్ వద్దు.. ఓపిఎస్ ముద్దు..

ఎన్ ఓ పి ఆర్ యూ ఎఫ్ 
దక్షిణ భారత ఇంచార్జీ మాచన రఘునందన్..

IMG-20250601-WA0638
ఎన్ ఓ పి ఆర్ యూ ఎఫ్  దక్షిణ భారత ఇంచార్జీ మాచన రఘునందన్..

హైదరాబాద్, జూన్ 01, న్యూస్ ఇండియా ప్రతినిధి: పాత పింఛను పథకం పునరుద్ధరణ కోసం అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉంటామని, నేషనల్ ఓల్డ్ పెన్షన్ రెస్టారేషన్ యునైటెడ్ ఫ్రంట్ దక్షిణ భారత భాధ్యులు మాచన రఘునందన్ పునరుద్ఘాటిoచారు. ఆదివారం ఆయన బెంగుళూరు లో జరిగిన ఎన్ ఓ పి ఆర్ యూ ఎఫ్ కర్ణాటక సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉద్యోగం ఉన్నా ఆర్థిక భద్రత లేని కొలువులు సిపిఎస్ ఉద్యోగులు చేస్తున్నారని, రఘునందన్ అవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల జీతం డబ్బు ను ప్రభుత్వం జూదం లాంటి షేర్ మార్కెట్ లో పెట్టడం భావ్యం కాదని రఘునందన్ అభిప్రాయపడ్డారు. భాగస్వామ్య పింఛను పథకం,యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ల రద్దు కోసం పాలకులు,రద్దు చేస్తామని హామీ ఇచ్చి పబ్బం గడుపు కుంటున్నారే తప్ప. పట్టించుకోవడం లేదని రఘునందన్ అవేదన వ్యక్తం చేశారు. సిపిఎస్ రద్దు అన్న అంశం పాలకులకు ఓ రాజకీయ అస్త్రంగా ఉపయోగపడుతోందని, దైవాధీనం అయ్యిందని, అందుకే పాత పెన్షన్ స్కీమ్ ను పునరుద్దరించేలా పాలకులు ఓ గట్టి నిర్ణయం తీసుకోవాని సి పి ఎస్ శ్రేణులు ముక్త కంఠం తో ఘోషిస్తున్నట్టు రఘునందన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఓ పి ఆర్ యూ ఎఫ్ కర్ణాటక శ్రేణులు, కర్నాటక ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రమేష్ సంగా, సి పి ఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు నాగన్న గౌడ, చంద్ర శేఖర్, నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు. అనంతరం రఘునందన్ ను జ్ఞాపిక తో సత్కరించారు.

Views: 12

About The Author

Post Comment

Comment List

Latest News

హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్: డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...
ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం
ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు
మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..