ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..

సమాజ శ్రేయస్సు కోసం యువత పాటుపడాలి...

On
ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..

సమాజ శ్రేయస్సు కోసం యువత పాటుపడాలి...

IMG-20250609-WA0799
ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న గురువులు పూర్వ విద్యార్థిని, విద్యార్థులు..

నల్గొండ జిల్లా, జూన్ 09, న్యూస్ ఇండియా ప్రతినిధి: సమాజ శ్రేయస్సు కోసం యువత పాటుపడాలని గురువులు అన్నారు. నల్లగొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చదువుకున్న 1996 - 1997 ఎస్‌ఎస్‌సీ బ్యాచ్‌ కు చెందిన పూర్వ విద్యార్థులు వారు చదువుకున్న పాఠశాల ఆవరణలో ఎన్. సోమయ్య, పి. పౌలు, పి. జాన్ సుందర్, ఎం యాదయ్య, ఎం ప్రవీణ్, డి సత్యం, డి. సోమయ్య, పి. సత్యనారాయణ, పి. నాగయ్య, ఎన్. సైదులు, ఆర్. స్వామి పి. వెంకన్న ల ఆధ్వర్యంలో ఆదివారం  ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు విద్యాబుద్దులు నేర్పిన ఆనాటి వారి గురువులు హర్సుధన్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, సత్యవతి రెడ్డి, సత్తార్, మధు లను ఆహ్వానించి వారి ఆశీర్వాదం పొందారు. అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయుల విద్యాబోధనను గుర్తు చేసుకొని వారిని కొనియాడారు. ఆ తర్వాత ఉపాధ్యాయులను,  విద్యార్థినీ, విద్యార్థులు పూలమాల, శాలువాలతో సన్మానించారు.ఈ  కార్యక్రమంలో గురువులు మాట్లాడుతూ.. సమాజ శ్రేయస్సు కోసం యువత పాటుపడాలని జీవితంలో ఏ స్థాయిలో ఉన్నా కూడా తల్లిదండ్రులను,గురువులను మర్చిపోవద్దన్నారు. అనంతరం గురువులను ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. ఆర్గనైజర్స్ మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న వారికి అండగా ఉండాలని అన్నారు. అందరం కలిసికట్టుగా వారికి సహాయం అందించాలని సూచించారు. ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు.

Views: 6

About The Author

Post Comment

Comment List

Latest News

టెన్త్ విద్యార్థి ఆత్మహత్య  టెన్త్ విద్యార్థి ఆత్మహత్య 
కొత్తగూడెం (న్యూస్ ఇండియా ప్రతినిధి)మార్చి 13: ఈనెల 14వ తేదీ నుంచి  10వ తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో   టెన్త్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కొత్తగూడెంలో...
సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో యాంటి - డ్రగ్స్ ఆవేరేన్స్
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక
మహిళా న్యాయవాదుల కోసం ఆరోగ్య అవగాహన 
కేంద్ర ప్రభుత్వం ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్లో సువర్ణ అవకాశం
శంభాజీ మహారాజు 337 వర్ధంతి సందర్భంగా ఎగ్జామ్ ప్యాడ్లు మరియు పెన్నుల పంపిణీ
నో స్మోకింగ్ ప్లీజ్.. ‘మాచన’ ప్రార్థన..