సాగర్ హైవే మల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..

ముగ్గురు మృతి, నాలుగురికి గాయాలు..

On
సాగర్ హైవే మల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..

రంగారెడ్డి జిల్లా, జూన్ 11, న్యూస్ ఇండియా ప్రతినిధి: యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో గిరిధర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్సు కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన బుధవారం అర్ధరాత్రి మాల్ సమీపంలోని ఎస్సార్ పెట్రోల్ బంక్ వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ బాలానగర్కు చెందిన వాస సాయితేజ (22) మూసాపేట్కు చెందిన వాస పవన్ కుమార్ (25), వనస్థలిపురంకు చెందిన రాఘవేందర్ (25) మరో నలుగురు స్నేహితులతో కలిసి వైజాగ్ కాలనీకి వెళ్లారు. తిరిగు ప్రయాణంలో హైదరాబాద్ కు

IMG_20250611_09445688
ప్రమాదంలో అయిన బస్సు, కారు దృశ్యాలు..

వస్తుండగా.. మాల్ సమీపంలోని మైసమ్మ దేవాలయం దాటి ఎస్సార్ పెట్రోల్ బంకు వద్దకు చేరుకోగానే నాగార్జునసాగర్ వైపు వెళ్తున్న ఓ ట్రావెల్స్ బస్సు ఎదురుగా వచ్చి కాను బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు స్పాట్లోనే మృతి చెందారు. వాస శివకుమార్, వాస సాయికుమార్, ఎం.సందీప్, శివ కుమార్లకు తీవ్ర గాయాలు కాగా.. స్థానికులు వారిని చికిత్స కోసం నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Views: 26

About The Author

Post Comment

Comment List

Latest News

జగన్ ను కలిసిన కళికాయి నారాయణ జగన్ ను కలిసిన కళికాయి నారాయణ
న్యూస్ ఇండియా హనుమంతునిపాడు  తాడేపల్లి  క్యాంపు కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కనిగిరి నియోజకవర్గ ఇంచార్జ్ దద్దాల...
నూతనంగా సభ్యత్వం
సీజ్ ద షాప్
తొర్రూరు పట్టణంలోని అభ్యాస్ స్కూల్లో పదవ తరగతి విద్యార్థి ఎలకల మందు తాగి మృతి
‘సమాచారం ఫుల్, చర్యలు నిల్’ ఎక్సైజ్ శాఖ నిర్వాకం!
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి..
అన్నార్థుల ఆకలి తీరుస్తున్న రెడీ టు సర్వ్ ఫౌండేషన్..