ఓజోన్ హాస్పటల్లో దారుణం.. 

వైద్యుల నిర్లక్ష్యంతో రైతు మృతి..

On
ఓజోన్ హాస్పటల్లో దారుణం.. 

మృతదేహానికి వైద్యం చేశారని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువుల ఆరోపణ.. ఓజోన్ హాస్పిటల్ ముందు మాకు న్యాయం చేయాలని ధర్నా చేశారు.

ఓజోన్ హాస్పటల్లో

IMG-20250704-WA1329
మృతదేహానికి వైద్యం చేశారని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువుల హాస్పిటల్ ముందు మాకు న్యాయం చేయాలని ధర్నా..

దారుణం.. 

వైద్యుల నిర్లక్ష్యంతో రైతు మృతి..

మృతదేహానికి వైద్యం చేశారని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువుల ఆరోపణ..

Read More మన్నెగూడలోని ఎస్ఆర్ హ్యాచరీస్ పై రైతుల ఆగ్రహం..

ఎల్బీనగర్, జులై 04, న్యూస్ ఇండియా ప్రతినిధి: వైద్యుల నిర్లక్ష్యంతో ఒక రైతు మృతి చెందిన ఘటన కొత్తపేట ఓజోన్ హాస్పటల్లో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. చనిపోయిన వ్యక్తికి వైద్యం చేశారని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు.‌ కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... సూర్యాపేట జిల్లా పెనుపహాడ్ మండలం అనంతారం గ్రామానికి చెందిన బైరెడ్డి భగవంత్ రెడ్డి (60), భార్య దుర్గమ్మ (50). వృత్తిరీత్యా స్వగ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గత నెల 30వ తేదీన ఒంట్లో నలతగా ఉందని ఎన్టీఆర్ నగర్ లోని ఓజోన్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరాడు. భగవంత్ రెడ్డి కి పూర్తిగా వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని సూచించారు. అందుకుగాను రూ. 8 లక్షలకు ఒప్పందం కుదుర్చుకొని ఈనెల 2వ తేదీన ఉదయం సుమారు 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, రాత్రి 8 నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు రెండు దఫాలుగా ఆపరేషన్లు నిర్వహించినట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. దాదాపు 20 యూనిట్ల రక్తాన్ని ఎక్కించి, రెండు రోజులుగా ఎవరిని కూడా ప్రత్యేక చికిత్స విభాగానికి పోకుండా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో బాధిత రైతు కుటుంబ సభ్యుల ఐసీయూలోకి వెళ్లి చూడగా అప్పటికే భగవంత్ రెడ్డి చనిపోయినట్లు నిర్ధారించుకున్నారు. రెండు రోజుల క్రితం చనిపోయిన మృతదేహానికి రక్తం ఎక్కించి తమను మోసం చేశారని మృతుడి కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళన నిర్వహిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న చైతన్యపురి పోలీసులు విచారణ చేస్తున్నారు.

Views: 5

About The Author

Post Comment

Comment List

Latest News