యువకులకు హెచ్చరిక చేసిన యాచారం పోలీసులు
మొండి గౌరెల్లి లో బెల్టు షాపుల అమ్మకాల జోరు*
-8 బీర్లు, 15 మందు బాటిల్ స్వాధీనం
మత్తుకు చిత్తు కావొద్దు
యువకులకు హెచ్చరిక చేసిన యాచారం పోలీసులు

రంగారెడ్డి జిల్లా, యాచారం, జులై 23, న్యూస్ ఇండియా ప్రతినిధి: యాచారం మండల పరిధిలో మొండి గౌరెల్లి లో బెల్ట్ షాపులు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. సోమవారం అర్ధరాత్రి సమయంలో బడే కుమార్ కిరాణా షాపులో యాచారం పోలీసులు సోదా చేయగా 8 బీర్లు, 15 మందు బాటిల్ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ గ్రామంలో యువకులు మందుకు బానిస కావద్దని యాచారం పోలీసులు అవగాహన కల్పించారు. కిరాణా షాపుల్లో ప్రజలకు ఉపయోగపడే సరుకులు అమ్మాలని తెలిపారు. కానీ చట్టానికి విరుద్ధంగా కిరాణా షాపు ముసుగులో బెల్ట్ షాపులు అడ్డం పెట్టుకుని వ్యాపారం కొనసాగిస్తున్న వారిని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువకులు చదువుకున్న వయసులో ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని వారు సూచించారు. ఎవరైనా బెట్టు షాపులో మందు బాటిల్ అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బెల్ట్ షాపుల్లో మందు బాటిల్ అమ్మకూడదని గ్రామస్తులు యాచారం పోలీసులకు సమాచారం అందించారు.
Comment List