మంత్రి మల్లారెడ్డికి ఐటీ షాక్

On

మంత్రి మల్లారెడ్డి నివాసంతో పాటు ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఇవి మరో 48 గంటలపాటు కొనసాగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మల్లారెడ్డి సన్నిహితుల నివాసాల నుంచి ఐటీ అధికారులు భారీగా డబ్బు సీజ్ చేశారు. ఇప్పటికే సుచిత్రాలో ఉంటోన్న త్రిశూల్ రెడ్డి ఇంట్లో రెండు కోట్ల రూపాయలు సీజ్ చేశారు. జీడిమెట్ల పైప్ లైన్ రోడ్ లో నివాసం ఉంటున్న మరో సన్నిహితుడు రఘునాథ్ రెడ్డి వద్ద రెండు కోట్లకుపైగా నగదు […]

మంత్రి మల్లారెడ్డి నివాసంతో పాటు ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఇవి మరో 48 గంటలపాటు కొనసాగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

మల్లారెడ్డి సన్నిహితుల నివాసాల నుంచి ఐటీ అధికారులు భారీగా డబ్బు సీజ్ చేశారు. ఇప్పటికే సుచిత్రాలో ఉంటోన్న త్రిశూల్ రెడ్డి ఇంట్లో రెండు కోట్ల రూపాయలు సీజ్ చేశారు.

జీడిమెట్ల పైప్ లైన్ రోడ్ లో నివాసం ఉంటున్న మరో సన్నిహితుడు రఘునాథ్ రెడ్డి వద్ద రెండు కోట్లకుపైగా నగదు స్వాధీనం చేసుకున్నారు.

కొంపల్లిలోని బొబ్బిలి ఎవెన్యూ లోని ఫ్లాట్ నెంబర్ 302లో ఉంటోన్న సంతోష్ రెడ్డి నివాసంపై ఐటీ అధికారులు దాడులు చేశారు.

Read More ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

అయితే డోర్ ఓపెన్ చేయకపోవడంతో 3 గంటల పాటు వేచి చూసిన అధికారులు ఆ తర్వాత తాళాలు పగులకొట్టారు. ఆ సమయంలో సీఆర్‌పీఎఫ్ బలగాలు ఐటీ అధికారుల వెంట ఉన్నాయి.

Read More ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి..

సంతోష్ రెడ్డి మల్లారెడ్డికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు చూస్తున్నారు. సంతోష్ రెడ్డి నివాసంలో రెండు ఎలక్ట్రానిక్ లాకర్లను ఐటీ అధికారులు గుర్తించారు.

Read More విజయవాడ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..

దూలపల్లి పల్లి రోడ్డులోని అశోక విల్లాలో నివాసం ఉంటోన్న్ మల్లారెడ్డి మరదలి కుమారుడు ప్రవీణ్ రెడ్డి ఇంట్లో కూడా ఐటి అధికారులు సోదాలు కొనసాగాయి. మల్లారెడ్డి యూనివర్సిటీకి సంబందించిన అన్ని వ్యవహారాలు ప్రవీణ్ రెడ్డి చూసుకుంటున్నారు.

అటు మంత్రి ఇంట్లో ఐటీ సోదాలకు నిరసనగా టీఆర్ఎస్ పలు చోట్ల నిరసనలు చేపట్టింది.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

జగన్ ను కలిసిన కళికాయి నారాయణ జగన్ ను కలిసిన కళికాయి నారాయణ
న్యూస్ ఇండియా హనుమంతునిపాడు  తాడేపల్లి  క్యాంపు కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కనిగిరి నియోజకవర్గ ఇంచార్జ్ దద్దాల...
నూతనంగా సభ్యత్వం
సీజ్ ద షాప్
తొర్రూరు పట్టణంలోని అభ్యాస్ స్కూల్లో పదవ తరగతి విద్యార్థి ఎలకల మందు తాగి మృతి
‘సమాచారం ఫుల్, చర్యలు నిల్’ ఎక్సైజ్ శాఖ నిర్వాకం!
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి..
అన్నార్థుల ఆకలి తీరుస్తున్న రెడీ టు సర్వ్ ఫౌండేషన్..