స్థానిక సంస్థల ఎన్నికల్లో   ఆర్ ఎల్ డి సత్తా చాటుతుంది 

విలువలు గల రాజకీయాలలో యువతకు ప్రాధాన్యం

On
స్థానిక సంస్థల ఎన్నికల్లో   ఆర్ ఎల్ డి  సత్తా చాటుతుంది 

ఆర్.ఎల్.డి రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్

IMG-20250726-WA0360భద్రాద్రి కొత్తగూడెం( న్యూస్ ఇండియా బ్యూరో ): స్థానిక సంస్థల ఎన్నికలలో ఆర్ ఎల్ డి సత్తా చాటుతుందని ఆర్.ఎల్.డి రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ అన్నారు. శుక్రవారం కొత్తగూడెంలోని ఉర్దూగర్లో కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులుగా కట్ట సతీష్ ను నియమించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్.ఎల్.డి  అధ్యక్షులు జయంత్ సింగ్ చౌదరి ఆధ్వర్యంలో పార్టీ మరింత బలపడుతుందని అన్నారు.విలువలు గల రాజకీయాలలో యువతకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. ప్రజలలో చైతన్యం కోసం త్వరలోనే పాదయాత్ర చేపడతామని, రెండు నెలల్లో పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. విద్య, వైద్య రంగాలలో రాష్ట్రం చాలా వెనకబడ్డదని, గత పాలకులు కుటుంబ పాలనలోనే నడిచిందని, ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరు లక్ష కోట్ల రూపాయలు వెనక వేసుకున్నారని అన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఆర్థికంగా డబ్బులు లేక ఇబ్బంది పడుతుందన్నారు. యువతకు పొలిటికల్ పై బోధన  అలాగే ఆన్లైన్లో స్పోకెన్ ఇంగ్లీష్ కూడా పార్టీ తరఫున నిర్వహిస్తామని తెలిపారు. జర్నలిస్టు నిఘా అనే వార పత్రికను కూడా పార్టీ నడిపిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి జిల్లా అధ్యక్షులు కట్ట సతీష్, ఖమ్మం జిల్లా అధ్యక్షులు జానీ, ఉమ్మడి జిల్లా జనరల్ సెక్రెటరీ జి.వి, అశ్వారావుపేట జనరల్ సెక్రెటరీ ప్రసాద్ దొర, అంకినీయుడు ప్రసాద్, సమ్మయ్య మీనాక్షి, మల్లేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

 

Views: 2
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News