ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి..

On
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

IMG-20250725-WA0907
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి..

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి..

రంగారెడ్డి జిల్లా, జూలై 26, న్యూస్ ఇండియా ప్రతినిధి: రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నందున జిల్లా ప్రజలు ఎవరు బయటకు రావద్దని, శిథిలావస్థ భవనాల్లో ఉండకూడదని, చిన్న పిల్లలు, వృద్దులు, పెద్దలు  బయటకు రావద్దని  జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.  
జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వర్షాలకు పొంగుతున్న వాగులు, చెరువులు వద్దకు ప్రజలు వెళ్ళొద్దని, ప్రజలు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ప్రకటనలో తెలిపారు. వర్షంలో విద్యుత్ సబ్ స్టేషన్లు, సెల్ టవర్లు, చెట్ల కింద ఉండొద్దని విద్యుత్ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. విద్యుత్ ప్రమాదాలు సంభవించే అవకాశం ఉండడంతో విద్యుత్ స్తంభాలు, స్టే వైర్లు తదితర వాటిని తాకరాదని హెచ్చరించారు. వర్షాల కారణంగా చెట్లు కొమ్మలు, వాహనాలు, భవనాలపై విద్యుత్ తీగలు పడే ప్రమాదం ఉండడంతో అలాంటి ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  డ్రెయినేజీ, నాలాలు పొంగిపొర్లే ప్రాంతాలు, వరద పారుతున్న సందర్భాలలో పిల్లలను వెళ్లకుండా నియంత్రణ చేయాలని. తగు జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేశారు. రైతులు కూడా వర్షం పడుతున్న సమయంలో పొలాల వద్దకు వెల్లకుండ ఉండాలని, పశువులను బయటకు వదలకుండా ఉండాలని అన్నారు. వాగులు, వంకలు, చెరువుల వద్దకు పిల్లలు, పెద్దలు వెళ్లకుండా ఉండాలని తెలిపారు. శిథిలావస్థ భవనాల్లో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని, దగ్గరలోని కమ్యూనిటీ హాల్స్ లో ఉంచాలని  అధికారులకు సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అత్యవసర సహాయం కోసం లేదా ఏవైనా సమస్యలు ఎదురైతే ప్రజలు కంట్రోల్ రూమ్ 040-23237416 నంబర్ కు కాల్ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 24 గంటలు పని చేస్తుందని ఆయన అన్నారు.

Views: 3

About The Author

Post Comment

Comment List

Latest News