సుజాత నగర్ పోలీస్ స్టేషన్ సందర్శించిన ఓఎస్డి

On
సుజాత నగర్ పోలీస్ స్టేషన్ సందర్శించిన ఓఎస్డి

సుజాతనగర్ (న్యూస్ఇండియా బ్యూరో నరేష్):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఓఎస్డి గోపతి నరేందర్ సుజాతనగర్ పోలీస్ స్టేషన్ను శనివారం సందర్శించారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను, స్టేషన్ సెక్యూరిటీ విధానంను తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. స్టేషన్ సిబ్బంది అందరూ ఎప్పటికప్పుడు నక్సలైట్ల విధివిధానాలపై అవగాహన కలిగి ఉండి సమాచారం సేకరించాలని, విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని స్టేషన్ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని , రాబోవు ఎలక్షన్లకు సంబంధించి గ్రామాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చుంచుపల్లి సిఐ ఆర్.వెంకటేశ్వర్లు, సుజాతనగర్ ఎస్ఐ ఎం.రమాదేవి, సిబ్బంది పాల్గొన్నారు.

Views: 56
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News