అవినీతి, అసమర్థ అధికారుల దర్పణం: ఈ 'గోడ'

• అవినీతి, అసమర్థ అధికారులపై అఖండ విశ్వాసం! • బంగారు కత్తి అని మెడ కోసుకొంటారా? • 'జిల్లా కలెక్టర్ల' ను సైతం అమాంతంగా మింగేసే తిమింగలాలు!

On
అవినీతి, అసమర్థ అధికారుల దర్పణం: ఈ 'గోడ'

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జులై  27, న్యూస్ ఇండియా : సంగారెడ్డి జిల్లా, తెల్లాపూర్ మునిసిపాలిటీ, రామచంద్రపురం మండలం, ఈదుల నాగులాపల్లి గ్రామం పరిధి లో యథేచ్ఛగా అక్రమ కట్టడాలు నిర్మించారు. ఈదుల నాగులాపల్లి గ్రామా పరిధి ప్రారంభం నుడి మొదలుకొని పరిధి ముగింపు వరకు 100 అడుగుల రోడ్డు కు ఇరువైపులా 'పది అడుగుల ఎత్తు,  కొన్ని వందల మీటర్ల పొడవునా అక్రమంగా విశాలమైన గోడలు నిర్మించారు. బౌన్సర్లను కాపలాగా పెట్టి ప్రశ్నిస్తున్న గ్రామస్తులను బయపెట్టి, సంబంధిత అధికారులను అవినీతితో ప్రభావితం చేసి తద్వారా వారిని అసమర్ధులుగా మార్చి సమస్త గ్రామా ప్రజలను సాక్షిగా ఈ అక్రమ నిర్మాణము గావించారు. ఈ గోడలవల్ల రైల్వేశాఖ అధికారులకు ఎలాంటి ఇబ్బందులు లేవని, ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదని సంగారెడ్డి జిల్లా అధికారులు జవాబు చెప్పడం గ్రామస్తులను విస్మయానికి గురిచేసింది. ఓక ప్రముఖ నిర్మాణ సంస్థ చట్టాలను విస్మరించి అక్రమకట్టడాలు నిర్మిస్తుంటే వాటిని అడ్డుకొని చర్యలు తీసుకోవలసిన సంగారెడ్డి జిల్లా అధికారులు చట్ట రీత్యా చేయవలసిన పనులు చేయకపోగా..? చర్యలకు బదులుగా పనికిమాలిన వ్యక్తిగత తీర్పులు ఇవ్వడం గ్రామస్తులను ఆశ్ఛర్యానికి గురిచేసింది. సంబంధిత 'సంగారెడ్డి జిల్లా అధికారుల అవినీతి, అసమర్థ పని తీరు అధికారులకు ఈ 'గోడ' ఒక దర్పణం లాంటిదని, ఈ అక్రమ నిర్మాణం పట్ల గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేసారు. ఈ అక్రమ కట్టడం చూస్తుంటే అధికారుల అవినీతి, అసమర్థతల పట్ల 'అఖండ విశ్వాసం' కలుగుతున్నదని గ్రామస్తులు అసహనం వెలిబుచ్చారు. ఈ గోడల వల్ల రైల్వేశాఖ కు కానీ వేరే ఇతరులకు కానీ ఎలాంటి ఇబ్బందులు లేవని అధికారులు చెపుతుంటే 'బంగారు కత్తి అని మెడ కోసుకొన్నట్టు' అనే చందంగా అర్థం అవుతున్నదని, తద్వారా చట్టాలను విస్మరించి ఇలా అక్రమ కట్టడాలు చేసుకోవచ్చు అనే సందేశం బోధిస్తున్నట్టు స్పష్టమౌతున్నదని గ్రామస్తులు అధికారుల బాధ్యతారాహిత్యానికి దుయ్యబట్టారు. 'మునిసిపల్ కమిషనర్, తహిశీల్ధార్, అర్డిఓ తో పాటు 'జిల్లా కలెక్టర్ల' ను సైతం అమాంతంగా మింగేసే తిమింగలాల మాదిరిగా ఈ ప్రముఖ నిర్మాణ సంస్థ పనులు జరుగుతున్నాయని అధికారుల పనితీరు పట్ల గ్రామస్తులు అవిశ్వాసం తో నిరాశ, నిస్పృహలతో వారి బాధను వ్యక్తం చేసారు. e0f87414-7db4-44d4-ba7b-38db215217e1 copy

Views: 4
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News