ఉద్యమ రోజులను గుర్తు చేసుకొన్న ‘హరీష్ రావు, ఓం ప్రకాశ్’

•మాజీ మంత్రి హరీష్ ను కలిసిన న్యాయవాది ఓం ప్రకాశ్...

On
ఉద్యమ రోజులను గుర్తు చేసుకొన్న ‘హరీష్ రావు, ఓం ప్రకాశ్’

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జులై  31, న్యూస్ ఇండియా : మాజీ మంత్రి హరీష్ రావు ను పటాన్ చెరు నియోజకవర్గానికి చెందిన ఉద్యమ కారుడు,న్యాయవాది ఓం ప్రకాశ్ మర్యాద పూర్వకంగా కలిశారు. బుధవారం నాడు హైదరాబాద్ లోని ఆయన నివాసంలో హరీష్ రావు ను కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో మాజీ మంత్రి హరీష్ రావు తో కలసి పాల్గొన్న ఘటనలు, ఉద్యమ రోజులను గుర్తు చేశారు. ఆప్యాయంగా పలకరించిన హరీష్ రావు పటాన్ చెరు నియోజకవర్గంలో బీ ఆర్ ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వారిని సూచించారు. తెలంగాణ సాధన కోసం పోరాడినట్లే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అరాచకాలు, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలన్నారు. పార్టీ కోసం పనిచేసే ప్రతిఒక్కరి కష్టానికి తగిన గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం ఉద్యమ కారుడు,న్యాయవాది ఓం ప్రకాశ్ మాట్లాడుతూ మాజీ మంత్రి హరీష్ రావు సలహాలు సూచనలతో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. ఎప్పటికప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ప్రజలలో చైతన్యం కలిగిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ కారులు, కార్యకర్తలు, నయవాదులు తదితరులు పాల్గొన్నారు.WhatsApp Image 2025-07-30 at 9.32.39 PM

Views: 21
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

బాల కార్మిక వ్యతిరేకంగా (నిషేధంపై)అవగాహన కార్యక్రమం.. బాల కార్మిక వ్యతిరేకంగా (నిషేధంపై)అవగాహన కార్యక్రమం..
ముందుకు ఒక అడుగు – బాల కార్మిక వ్యతిరేకంగా గొంతు కలిపే ప్రతి పౌరుడూ మార్పు దిశగా ఒక శక్తివంతమైన చిహ్నం అవుతారు..
రేషన్ కార్డు అనేది ఒక పత్రం కాదని, ఆత్మగౌరవ పత్రం...
గ్రామ పంచాయతీ నిర్మాణం స్మశాన వాటిక పక్కన నిర్మించొద్దు..
విజిబుల్ పోలీసింగ్ తో ప్రజల భద్రతకు భరోసా..
పెద్దకడుబూరు మండలం : సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించిన యువతి...
*ఆకాస్మికంగా ఎరువులను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్*
సంగారెడ్డి జిల్లాకు విచ్చేసిన జిల్లా ఇన్చార్జ్ మంత్రి ‘డాక్టర్ వివేక్ వెంకటస్వామి’