గ్రామ పంచాయతీ నిర్మాణం స్మశాన వాటిక పక్కన నిర్మించొద్దు..
పాత భవనం స్థలంలోనే నూతనంగా జీపి ఏర్పాటు చేయాలి..
గ్రామ పంచాయతీ నిర్మాణం స్మశాన వాటిక పక్కన నిర్మించొద్దు..
పాత భవనం స్థలంలోనే నూతనంగా జీపి ఏర్పాటు చేయాలి..

రంగారెడ్డి జిల్లా, ఆగష్టు 01, న్యూస్ ఇండియా ప్రతినిధి: నూతన గ్రామపంచాయతీ కార్యాలయం స్మశాన వాటిక పక్కన ఏర్పాటు చేయడం తమకు ఇష్టం లేదని ప్రస్తుతం ఉన్న గ్రామపంచాయతీ ప్రదేశంలోనే నూతన పంచాయతీ కార్యాలయం ఏర్పాటు చేయాలని చెన్నంపల్లి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసం కొంతమంది గ్రామానికి చివర్లో స్మశాన వాటిక ప్రక్కన గ్రామపంచాయతీ కార్యాలయం ఏర్పాటు కోసం ముగ్గు పోసారని పనులను నిలిపివేసి ప్రస్తుతమున్న ప్రదేశంలోనే పంచాయతీ కార్యాలయం ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యేను కోరుతున్నారు.గ్రామపంచాయతీ భవనం నిర్మాణం కోసం గ్రామస్తుల నిర్ణయం తీసుకోకుండానే కొంతమంది ఏక అభిప్రాయంతో ఈ నిర్మాణానికి పూనుకున్నారని విమర్శించారు.ఉన్నత స్థాయి అధికారులు కల్పించుకొని తక్షణమే స్మశాన వాటిక పక్కన ఏర్పాటు చేస్తున్న భవన నిర్మాణం ఆపివేయాలని కోరుతున్నారు.లేనిపక్షంలో తామే భవన నిర్మాణ పనులు అడ్డుకుంటామని హెచ్చరించారు.
Comment List