59 జి.ఓ కు పాతర, అవినీతి అధికారుల జాతర!

• శాఖల "అసమన్వయం" ప్రభుత్వ ఆస్తికి గొడ్డలిపెట్టు! • భౌతికంగా లేని నిర్మాణాలను పత్రాల పై సృష్టి! • పత్రాల పై వున్న విషయాలను అధికారికంగా ధ్రువీకరణ! • చివరి ఘట్టం.. భౌతికనిర్మాణాలే !!!

On
59 జి.ఓ కు పాతర, అవినీతి అధికారుల జాతర!

WhatsApp Image 2025-08-03 at 3.06.32 PM copyసంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఆగస్టు 04, న్యూస్ ఇండియా : 59 జి.ఓ కు పాతర, అవినీతి అధికారుల జాతరలాగా అవినీతి అధికారులు తమ స్వార్థం కోసం చట్టాలను, నియమాలను పక్కన పెట్టి, ప్రభుత్వ, ప్రజల సొమ్మును దోచుకోవడం, ఒక ఉత్సవంలా జరుపుకోవడం షరామామూలే అన్నట్టు కొనసాగుతుందని పిర్యాదుదారుడు ఆవేదన వ్యక్తం చేసాడు. ఈ సందర్భంగా సంగారెడ్డి పట్టణం సంగారెడ్డి ఎంపిడిఓ కార్యాలయానికి ఎదురుగ బైపాస్ రోడ్ మార్గంలో 59 జి.ఓ లో భూమి క్రమ బద్దికరణ కు ఇండ్లు లేకున్నా ఉన్నట్లు అధికారులు మోసపురితంగా చూపిస్తున్నారు.  మోసపురితంగా పొందిన ఇంటి నెంబర్ల రషీదు పుస్తకాలు, ఆస్థి పన్ను పుస్తకాలు, రిజిస్టర్ల పుస్తకాలు సమీక్షించకుండానే విచారణలు చేపడుతున్నారు. 'అర్ధసత్యాలతో' నివేదికలు తయారు చేసి సాక్షాత్తు జిల్లా కలెక్టర్ ను సైతం సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్, సంగారెడ్డి తహసీల్దార్ లు మోసం చేస్తున్నారు, తద్వారా ప్రభుత్వ ఆస్తులకు నష్టం చేకూర్చుతున్నారు. ఇట్టి అక్రమ నిర్మాణల పై అదనపు కలెక్టర్ లేదా డిర్ఓ చేత క్షేత్ర స్థాయి విచారణ నివేదిక కోరాలని ఫిర్యాదు దారు ఎం శ్రీధర్ డిమాండ్ చేశారు. సంగారెడ్డి పట్టణం ఎంపీ డి ఓ కార్యాలయం ఎదురుగ బై పాస్ రోడ్డుకు అనుకోని ఉన్న ప్రభుత్వ సర్వే నెంబర్ 374 లో శాఖల "అసమన్వయం" అనే అంశాన్ని అవకాశంగా తీసుకోనున్న అక్రమార్కులు మోస పురితంగా భౌతికంగా లేని ఇండ్లను ఉన్నట్లు సృష్టించి వాటికొరకై అక్రమ మార్గంలో ఇంటి నంబర్లను పొందినారు. తద్వారా 59 జి.ఓ కింద నిబంధనలకు విరుద్ధంగా క్రమబాద్దికరణ చేసుకొని వాటి పై మున్సిపల్ అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి మోసపురితంగా అనుమతులు పొందినారు. ఈ విధంగా అక్రమ నిర్మాణం చేస్తున్న వారి  పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తేది 09-06-2025 నాడు సామాజిక కార్యకర్తలు వినతిపత్రం సమర్పించారు. ఇంటి నంబర్ల సంబంధిత వాటి రషీదుబుక్కులు? రిజిస్టర్ లు? క్షేత్ర స్థాయిలో భూమి సర్వే నెంబర్లు హద్దు బందులు?  నిర్మాణం చేస్తున్న ఇండ్లు కల్వకుంట సర్వే నెంబర్లవా? సంగారెడ్డి సర్వే నెంబర్లవా? కనీస విషయాలను విచారణ చెయకుండా…? పత్రాల పై విషయాలను అధికారికంగా ధ్రువీకరణ చేస్తూ జిల్లా కలెక్టర్ ను మోసం చేస్తున్నారు. ఇటీవల కేవలం నామ మాత్రం బ్రీఫ్ రిపోర్ట్ పేరుతో మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి  Lr No. G 2/0611/2025, తేది: 01-07-2025  నాడు జిల్లా కలెక్టర్ కు కు అసంపూర్ణ అర్ధసత్య నివేదిక సమర్పించారు. ఈ సందర్బంగా ఫిర్యాదు దారుడు ఎం శ్రీధర్, సామాజిక కార్యకర్త మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయి పరిశీలన చేయకుండా మున్సిపల్ కమిషనర్ జిల్లా కలెక్టర్ కి ఇచ్చిన నివేదిక పట్ల అభ్యంతరాలు ఉన్నాయని, జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు దారుడు ఇచ్చిన వినతిపత్రం లో పేర్కొన్న అంశాలను వాటిని విచారణ చేయకుండా అసంపూర్తిగా ఇచ్చిన మున్సిపల్ కమిషనర్ నివేదిక ఆక్రమణ దారులకు అనుకూలంగా ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది ఆవేదన వ్యక్తం చేసాడు. వినతిపత్రం లో పేర్కొన్న అంశాలు ల పై సమగ్ర విచారణ చేయడానికి అదనపు కలెక్టర్ లేదా జిల్లా రెవిన్యూ అధికారి చేత సమగ్ర క్షేత్ర స్థాయి విచారణ నివేదిక కోరి బాధ్యుల పై కఠిన చర్య తిసుకొని విలువైన ప్రభుత్వ భూముల్లో చివరి ఘట్టం.. భౌతికనిర్మాణాలే అనే చందంగా కొనసాగుతున్నఅక్రమాలకు అక్రమ నిర్మాణలు తొలగించి, ప్రభుత్వ భూమి ని ప్రైవేట్ వ్యక్తుల నుండి స్వాధీనం చేసుకొని, ప్రభుత్వ సామాజిక అవసరాలకు అట్టి భూమిని వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Views: 36
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

నీచమైన అకృత్యాలు! నీచమైన అకృత్యాలు!
నీచమైన అకృత్యాలు!   సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఆగస్టు 04, న్యూస్ ఇండియా : సకల నీతులు వల్లించడం! పాఠశాల బోధనల పేరు! నీచమైన అకృత్యాలు!ఇదేనా.. సేంట్...
'కృతజ్ఞత' రూపం దాల్చిన 'జగ్గారెడ్డి కన్నీరు'
59 జి.ఓ కు పాతర, అవినీతి అధికారుల జాతర!
#Draft: Add Your Title
దేవదాయ శాఖ డైరెక్టర్ ను కలిసిన పెద్దమ్మతల్లి పాలకమండలి 
ఘనంగా వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
నమ్మించి మోసగించడం చంద్రబాబు నైజం - ఇంచార్జి దద్దాల