సమయం చాలా విలువైనదని, కష్టపడి చదివితే ఉన్న స్థాయికి చేరుతారు..
రంగారెడ్డి.జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ...
సమయం చాలా విలువైనదని, కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుతారు..
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి..
రంగారెడ్డి జిల్లా ఆగస్ట 06, న్యూస్ ఇండియా ప్రతినిధి: సమయం చాలా విలువైనదని, కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని జిల్లా కలెక్టర్ సి. నారాయణ

రెడ్డి అన్నారు. శంషాబాద్ మండలం పాలమాకులలోని కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్ ను కలెక్టర్ బుధవారం సాయంత్రం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బోధన, నీరు , ఆహారం, సౌకర్యాలను అడిగి తెలుసుకోవడంతో పాటు ఇంగ్లీష్, గణితం సబ్జెక్టులకు సంబంధించి విద్యార్థినిలను పలు ప్రశ్నలను అడిగారు. ఇంగ్లీష్ సబ్జెక్టులో విద్యార్థినిలు పేలవంగా ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం పోటీ ఎక్కువగా ఉందని, ఉన్నత చదువులు చదివిన వారు కూడా చిన్న చిన్న ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నారని, చదువుతో పాటు నైపుణ్యాలు (స్కిల్స్) కూడా ఉంటేనే అనుకున్న ఉద్యోగం వస్తుందని వివరించారు. ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని, ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చదువు ఒక ఆయుధమని, లక్ష్యాన్ని పెట్టుకొని ప్రణాళికతో చదవాలని అన్నారు. ఏఎన్ఏం, ఎస్ఓ, గ్రాఫ్ట్, కంప్యూటర్ ఆపరేటర్ టీచర్స్ లేరని విద్యార్థులు కలెక్టర్ దృష్టికి తేగా, వారం రోజుల్లోగా నియమిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం కలెక్టర్ వంటగదిని సందర్శించి విద్యార్థినిలకు వండిన వంటలను పరిశీలించడంతో పాటు టాయిలెట్లను పరిశీలించారు. కలెక్టర్ వెంట శంషాబాద్ మండలం తహసీల్దార్ రవీందర్ దత్, ఇంచార్జి ప్రిన్సిపల్, ఇతర అధికారులు ఉన్నారు.
Comment List