నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం..
ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు..
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం..
ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు

రంగారెడ్డి జిల్లా, యాచారం ఆగష్టు 07, న్యూస్ ఇండియా ప్రతినిధి:- నేరాల నియంత్రణ, కేసులు ఛేదనలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు అన్నారు. గురువారం యాచారం మండలం తక్కల్లపల్లి గ్రామంలో సీఐ నందీశ్వర్ రెడ్డి, ఎస్పై మధు ప్రజల సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఏసీపీ రాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. గ్రామ భద్రత కోసం సీసీ కెమెరాలు శ్రేష్ట ఆయుధం అన్నారు. ఒక సీసీ కెమెరా వంద మంది పోలీస్ సిబ్బందితో సమానమని, సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు నియంత్రిచవచ్చన్నారు. సీసీ కెమెరాల వల్ల దొంగతనాలు, అసాంఘిక కార్యక్రమాలు పాల్పడుతున్న వారిని తొందరగా గుర్తించే అవకాశం ఉంటుందని తద్వారా నేరాలు తగ్గుతాయని అన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు ముందుకు రావాలని, గ్రామాల్లో విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. స్వీయ రక్షణ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. యువత అసాంఘిక కార్యాకలాపాలకు దూరంగా ఉండాలని, గంజాయికి అలవాటు పడి బంగారు భవిష్యత్ నాశనం చేసుకోవద్దని అన్నారు. వారిని సక్రమమైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. మహిళలకు, బాలికలకు ఏమైనా ఇబ్బందులు తలెత్తితే డయల్ 100, షీ టీం వాళ్లని సంప్రదించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ విధిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలన్నారు. త్వరలో రాబోయే బోనాల పండుగను, వినాయక చవితిని ప్రతి ఒక్కరూ శాంతియుతంగా నిర్వహించుకోవాలని సూచించారు. అనంతరం సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన ఎస్ఆర్.హెచ్ హచరీస్ వాళ్లను ఏసిపి రాజు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ కంబాలపల్లి సంతోష, మాజీ ఉప సర్పంచ్ పగడాల శ్రీశైలం, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కోరే జగదీష్ రావు, నాయకులు గడల మల్లేష్, యూత్ అధ్యక్షులు కాంటెకార్ తులసి కుమార్, పంచాయతీ కార్యదర్శి గోపాల్ నాయక్, ఎస్.ఆర్.హెచ్ హచరీస్ ప్రతినిధి సుమన్ రెడ్డి, పడకంటి నితిన్, దోర్నాల జనార్దన్ రావు, బుచ్చయ్య, శంకరయ్య, మల్కాపూరం కృష్ణ, కంబాలపల్లి అరుణ్ కుమార్, కొండోజు రామాచారీ, కంబాలపల్లి బుచ్చయ్య పోలీసు సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Comment List