అప్రమత్తంగా ఉండండి... సమన్వయంతో వ్యవహరించండి

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వాసులకు ఎలాంటి ఇబ్బంది రానీయోద్దు..

On
అప్రమత్తంగా ఉండండి... సమన్వయంతో వ్యవహరించండి

వర్షాభావ పరిస్థితులు, వరద సహాయక చర్యలపై ఉన్నతస్థాయి సమీక్ష..అలసత్వం వహించొద్దని ఉన్నతాధికారులకు మంత్రి శ్రీధర్ బాబు హెచ్చరిక..

అప్రమత్తంగా ఉండండి... సమన్వయంతో వ్యవహరించండి..

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వాసులకు ఎలాంటి ఇబ్బంది రానీయోద్దు..

వర్షాభావ పరిస్థితులు, వరద సహాయక చర్యలపై ఉన్నతస్థాయి సమీక్ష..

అలసత్వం వహించొద్దని ఉన్నతాధికారులకు మంత్రి శ్రీధర్ బాబు...

Read More నీచమైన అకృత్యాలు!

Screenshot_2025-08-07-23-05-32-49_680d03679600f7af0b4c700c6b270fe7
అలసత్వం వహించొద్దని ఉన్నతాధికారులకు మంత్రి శ్రీధర్ బాబు..

రంగారెడ్డి జిల్లా, ఆగస్టు 07, న్యూస్ ఇండియా ప్రతినిధి:- భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వాసులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సంబంధిత ఉన్నతాధికారులను జిల్లా ఇంఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశించారు. గురువారం రాత్రి వర్షాభావ పరిస్థితులు, వరద సహాయక చర్యలపై ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని కలెక్టర్లు, జీహెచ్ఎంసీ, జలమండలి, టీజీఎస్పీడీసీఎల్, సైబరాబాద్, రాచకొండ పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించారు. శేరిలింగంపల్లి, హైటెక్ సిటీ పరిసరాలు, సరూర్ నగర్, ఉప్పల్, షేక్ పేట్, కూకట్ పల్లి, బాలానగర్, మల్కాజ్ గిరి, బండ్లగూడ, నాగోల్, మూసీ నది పరివాహాక ప్రాంతాల్లో వాస్తవ పరిస్థితిని అడిగి తెలుసుకుని మార్గనిర్దేశం చేశారు. కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అందుకు అనుగుణంగా సిబ్బందికి సూచనలు, సలహాలు ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. రాత్రిపూట కూడా విధులు నిర్వర్తించి, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ప్రజలు తమ ఇబ్బందులను తెలియజేసేందుకు వీలుగా తక్షణమే కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసి, వాటిపై ప్రసార, సామాజిక మాధ్యమాల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు. ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా రోడ్లపై నిలిచిన నీటిని వెంటనే తొలగించాలన్నారు. హైటెక్ సిటీ పరిసర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి, అక్కడ నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి సిద్ధంగా ఉండాలన్నారు. అక్కడ వారికి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలను కల్పించాలన్నారు. ప్రజలకు అత్యవసర సేవలు అందించడంలో ఏమాత్రం అలసత్వం వహించొద్దని హెచ్చరించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రతి సమస్యకూ తక్షణ పరిష్కారం చూపించాలన్నారు. ఎలాంటి ఆందోళనకు గురి కావొద్దని ప్రభుత్వం మీ వెంట ఉందని, అవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Read More 'కృతజ్ఞత' రూపం దాల్చిన 'జగ్గారెడ్డి కన్నీరు'

Views: 3

About The Author

Post Comment

Comment List

Latest News

అప్రమత్తంగా ఉండండి... సమన్వయంతో వ్యవహరించండి అప్రమత్తంగా ఉండండి... సమన్వయంతో వ్యవహరించండి
వర్షాభావ పరిస్థితులు, వరద సహాయక చర్యలపై ఉన్నతస్థాయి సమీక్ష..అలసత్వం వహించొద్దని ఉన్నతాధికారులకు మంత్రి శ్రీధర్ బాబు హెచ్చరిక..
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం..
సమయం చాలా విలువైనదని, కష్టపడి చదివితే ఉన్న స్థాయికి చేరుతారు..
*ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రజా యుద్దనౌక గద్దర్ కు  కవులు కళాకారుల ఐక్యవేదిక ఘనంగా నివాళులు
ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం- ఇంచార్జి దద్దాల
స్మార్ట్ మీటర్ల బిగింపు,విద్యుత్ చార్జీల పెంపుదల నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి
నీచమైన అకృత్యాలు!