కేసీఆర్ జిల్లాల బాట

On

తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. రా ష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు, సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో సీఎం కేసీఆర్.. ప్రజా క్షేత్రంలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే జిల్లాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారు గులాబీ బాస్. డిసెంబర్ నుంచి ఉమ్మడి జిల్లాల వారీగా పర్యటనలు చేస్తూ ఒక వైపు అభివృద్ధి కార్యక్రమాలు మరోవైపు బహిరంగ సభలతో ఎన్నికల వాతారవరణం క్రియేట్ చెయ్యబోతున్నట్టు తెలుస్తోంది. డిసెంబర్ మొదటి వారంలో మహబూబ్‌నగర్, జగిత్యాలలో రెండు బహిరంగ సభల్లో […]

తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. రా ష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు, సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో సీఎం కేసీఆర్.. ప్రజా క్షేత్రంలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

ఈ నేపథ్యంలోనే జిల్లాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారు గులాబీ బాస్. డిసెంబర్ నుంచి ఉమ్మడి జిల్లాల వారీగా పర్యటనలు చేస్తూ ఒక వైపు అభివృద్ధి కార్యక్రమాలు మరోవైపు బహిరంగ సభలతో ఎన్నికల వాతారవరణం క్రియేట్ చెయ్యబోతున్నట్టు తెలుస్తోంది.

డిసెంబర్ మొదటి వారంలో మహబూబ్‌నగర్, జగిత్యాలలో రెండు బహిరంగ సభల్లో పర్యటించబోతున్నారు.

అసెంబ్లీ సెషన్స్ ముగిసిన తర్వాత మహబూబాబాద్‌లో మరో బహిరంగ సభ నిర్వహించేలా టీఆర్‌ఎస్ రోడ్ మ్యాప్ సిద్దమయింది. డిసెంబర్ 4న ఉమ్మడి పాలమూరులో కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించి బహిరంగ సభలో పాల్గొంటారు. ఇప్పటికే మహబూబాబ్ నగర్ జిల్లా నాయకత్వం ఈ సభ పనుల్లో ఉన్నారు.

Read More ఔరవాణి గ్రామంలో బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షుడిగా ముక్కాముల శ్రీనివాస్ ఎన్నిక

ఇక డిసెంబర్ 7న జగిత్యాల జిల్లాలో దాదాపు 2 లక్షల మందితో బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభకు సంబంధించిన బాధ్యతలను ఎమ్మెల్సీ కవితకు అప్పగించినట్టు తెలుస్తోంది. పోడు భూముల సమస్యతో పాటు గిరిజన బంధు పథకానికి సంబంధించి కీలక ప్రకటన చేసేందుకు కేసీఆర్ ఈ బహిరంగ సభను ఉపయోగించుకుంటారని తెలుస్తోంది.

Views: 1
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి
విలేకరుల సమావేశంలో డిఎస్పి ఆదినారాయణ
27 డివిజన్ నుంచి భారీ మెజార్టీతో గెలిపించండి: మద్దెల సుధారాణి 
వైద్య సేవ నుంచి ప్రజా సేవకు 11వ వార్డు బరిలో డాక్టర్ పొనుగోటి సోమేశ్వరరావు
అభివృద్ధికి గుర్తు కమలం పొంగులేటి సుధాకర్ రెడ్డి
తొర్రూర్ మున్సిపాలిటీ 8వ వార్డులో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వినూత్న ఇంటింటి ప్రచారం
ఆడబిడ్డను ఆదరించి మున్సిపాలిటీకి పంపించాలని కోరుతూ, తొర్రూరు మున్సిపాలిటీ 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పంజా కల్పన
ఔరవాణి గ్రామంలో బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షుడిగా ముక్కాముల శ్రీనివాస్ ఎన్నిక