ఎమ్మెల్యేలకు ఎర కేసు

On

ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. జగ్గుస్వామి,తుషార్‌లను వెదికే పనిలో ఉంది సిట్. బీజేపీ నేత బీఎల్‌ సంతోష్‌ కోర్టు నుంచి రిలీఫ్ పొందడంతో ప్రత్యామ్నాయాలపై ఆలోచిస్తోంది సిట్‌. బీఎల్ సంతోష్‌పై కేసును పూర్తిగా క్వాష్ చేయాలా.. లేక వేరే ఏమైనా ఆదేశాలు ఇవ్వాలా అనేది.. కోర్ట్‌కు సిట్ సమర్పించే ఆధారాలను బట్టి ఉండనుంది. మరోవైపు నోటీసులు అందుకున్న న్యాయవాది ప్రతాప్‌గౌడ్‌.. నందకుమార్‌ భార్య చిత్రలేఖ సిట్‌ విచారణకు హాజరయ్యారు. 8 గంటలపాటు ప్రశ్నించిన అధికారులు […]

ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. జగ్గుస్వామి,తుషార్‌లను వెదికే పనిలో ఉంది సిట్.

బీజేపీ నేత బీఎల్‌ సంతోష్‌ కోర్టు నుంచి రిలీఫ్ పొందడంతో ప్రత్యామ్నాయాలపై ఆలోచిస్తోంది సిట్‌.

బీఎల్ సంతోష్‌పై కేసును పూర్తిగా క్వాష్ చేయాలా.. లేక వేరే ఏమైనా ఆదేశాలు ఇవ్వాలా అనేది.. కోర్ట్‌కు సిట్ సమర్పించే ఆధారాలను బట్టి ఉండనుంది.

మరోవైపు నోటీసులు అందుకున్న న్యాయవాది ప్రతాప్‌గౌడ్‌.. నందకుమార్‌ భార్య చిత్రలేఖ సిట్‌ విచారణకు హాజరయ్యారు.

Read More తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌...

8 గంటలపాటు ప్రశ్నించిన అధికారులు ఇవాళ నందు భార్య చిత్రలేఖ, ప్రతాప్‌ మళ్లీ విచారణకు రావాలని అధికారులు ఆదేశించారు.

Read More మంగళ్పల్లిలో ఆక్రమణల తొలగింపు..

నందకుమార్‌కు సంబంధించిన వ్యాపారులు, ఆర్థిక లావాదేవీలు, ఇతర వివరాలను తెలుసుకునేందుకు ఆయన భార్య చిత్రలేఖను సిట్ అధికారులు ప్రశ్నించారు.

Read More ఎలక్ట్రిక్‌ వాహనాలతో పర్యావరణ పరిరక్షణ: MG1 Shubham సీఈఓ కొత్త మనోహర్‌రెడ్డి

కొన్ని లావాదేవీలు చిత్రలేఖ బ్యాంకు ఖాతాల నుంచి జరిగినట్లు దర్యాప్తులో తేలగా అధికారులు నోటీసులిచ్చి ప్రశ్నించింది.
ఇక తుషార్‌ అండ్‌ జగ్గుస్వామిని ఇంటరాగేట్‌ చేస్తే కీలక ఆధారాలు దొరుకుతాయని భావిస్తున్నారు అధికారులు. ఈ ఇద్దరే ఈ కేసులో కీ పర్సన్స్‌గా భావిస్తోంది.

Views: 2
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News