వరిదాన్యం కేంద్రాలపై సమీక్ష సమావేశం
వరిదాన్యం కేంద్రాలపై సమీక్ష సమావేశం
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు తహసీల్దార్ కార్యాలయంలో గురువారం పిపిసి కేంద్రాల (PPC Centres) పై సమీక్షా సమావేశం నిర్వహించారు. తహసీల్దార్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అధికారులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. తహసీల్దార్ మాట్లాడుతూ — ప్రతి రైతు వరి ధాన్యం కేంద్రానికి వచ్చిన తేదీని తప్పనిసరిగా నమోదు చేయాలని తెలిపారు. తగినంత గన్నీ సంచులు ముందుగానే సిద్ధంగా ఉంచాలని, వరి ధాన్యం శుభ్రపరిచే యంత్రాలు, టార్పాలిన్లు, చెక్క పొదలు అన్ని పిపిసి కేంద్రాల్లో అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. అలాగే కేంద్రాల్లో తాగునీరు, టాయిలెట్లు, విద్యుత్, టెంట్లు వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మద్దతు ధర వివరాలు రైతులకు స్పష్టంగా తెలియజేసేలా బోర్డులు ప్రదర్శించాలని, పిపిసి సెంటర్ ఇన్ఛార్జిలు తమ కేంద్రాలను వదిలి వెళ్లకుండా నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు. తూకం వేసిన తరువాత ధాన్యం సంచుల రవాణా కోసం వాహన కాంట్రాక్టర్ ద్వారా తగినన్ని వాహనాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. దొడ్డువడ్ల ధాన్యాన్ని, సన్న వడ్ల ధాన్యాన్ని, కొనుగోలు కేంద్రంలోని వేర్వేరుగా ఉంచేలా ఏర్పాట్లు చేయాలని, ప్రతి పిపిసి కేంద్రంలో తగినంత మంది కార్మికులు ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటేశ్వర్లు, వ్యవసాయాధికారి రామనర్సయ్య, ఎస్ఐ ఉపేందర్, సీఈఓ మురళి, డిటీ, ఆర్ఐ, జి.పి.ఓలు తదితరులు పాల్గొన్నారు...
Comment List