పోలీస్ స్టేషన్ గోడ దూకి పారిపోతున ఎస్సై నీ వెంబడించి పట్టుకున్న ఏసీబీ అధికారులు

ఏసీబీకి చిక్కిన టేక్మాల్ ఎస్సై రాజేష్

పోలీస్ స్టేషన్ గోడ దూకి పారిపోతున ఎస్సై నీ వెంబడించి పట్టుకున్న ఏసీబీ అధికారులు

రిపోర్టర్ జైపాల్

న్యూస్ ఇండియా (టేక్మాల్ రిపోర్టర్ జైపాల్ నవంబర్ 18) మెదక్ జిల్లా టేక్మాల్ పోలీస్ స్టేషన్లో ఒక వింతైన ఘటన చోటుచేసుకుంది. సాక్షాత్తూ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ తన పోలీస్ స్టేషన్ గోడ దూకి పారిపోయాడు. ఒక కేసుకు సంబంధించి రూ. 30వేలు లంచం తీసుకుంటుండగా, ఎస్ఐ రాజేష్ ఏసీబీకి పోలీస్ స్టేషన్లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. దీంతో అతడ్ని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్న సమయంలో అక్కడి నుంచి పరుగు లంకించుకున్నాడు. ఏసీబీ అధికారుల నుంచి తప్పించుకుని పోలీస్ స్టేషన్ నుంచి బయటకి పారిపోయాడు. దీంతో ఎస్‌ఐ రాజేష్‌ని వెంబడించి, చివరికి ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అయితే, ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎస్సై రాజేష్ .. ఏసీబీకి చిక్కడంతో స్థానికులు సంబరాలు చేసుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు పెద్ద సంఖ్యలో చేరుకున్న మండల ప్రజలు స్థానిక నాయకులు పోలీస్ స్టేషన్ ముందు టపాసులు కాల్చి సంబరాలు.

Views: 5

Post Comment

Comment List

Latest News

వ్యభిచార అడ్డాగా హర్షిత గెస్ట్ హౌస్‌… యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ దాడులు.. వ్యభిచార అడ్డాగా హర్షిత గెస్ట్ హౌస్‌… యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ దాడులు..
వ్యభిచార అడ్డాగా హర్షిత గెస్ట్ హౌస్‌… యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ దాడులు.. వ్యభిచార అడ్డాగా హర్షిత గెస్ట్ హౌస్‌… యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ దాడులు.. ఆలస్యంగా వెలుగులోకి...
వృద్ధులకు ఫ్రెండ్లీ కేర్ భద్రత భరోసా
అనారోగ్య మరణించిన పీరమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం
ముదిరాజుల అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం
నూతన సంవత్సర వేడుకల వేళ.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..
తుర్కయంజాల్ మున్సిపాలిటీ ప్రజలకు తీవ్ర అన్యాయం...
#Draft: Add Your Title