కామేపల్లి మండలం మద్దులపల్లి గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పడిగ నాగమణి
On
ఖమ్మం, డిసెంబర్ 11 — న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం మద్దులపల్లి గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పడిగ నాగమణి పోటీలో ఉన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రామ ప్రజలు తనపై నమ్మకం ఉంచి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా సిసి రోడ్ల నిర్మాణం, పల్లె ప్రకృతి వనం ఏర్పాటు, పేదవారికి ఆర్థిక సహాయ పథకాలు వంటి అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గ్రామంలో అభివృద్ధి కార్యకలాపాలు నిలిచిపోయాయని ఆరోపించిన పడిగ నాగమణి,మళ్లీ బిఆర్ఎస్ ప్రభుత్వం రాబోవాలంటే ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో తనను గెలిపించాలని గ్రామ ప్రజలను అభ్యర్థించారు.
Views: 7
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
15 Dec 2025 22:38:06
ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్ ఆటోనగర్, సర్వే నంబర్–38లో అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి త్రవ్వకాలు చేపడుతున్న నమిశ్రీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ సంస్థపై తక్షణ...

Comment List