అటల్ బిహారీ వాజ్పేయి సుపరిపాలనా దినోత్సవం ( గుడ్ గవర్నెన్స్ డే )
మేరా యువ భారత్ ( మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ) వారి సహకారంతో సయ్యద్ యూత్ క్లబ్ వారు గుడ్ గవర్నెన్స్ డే బీసీ వెల్ఫేర్ డిగ్రీ కాలేజ్ రఘునాధపాలెం ఖమ్మం నందు ఘనంగా నిర్వహించడం జరిగింది, ముఖ్య అతిథులుగా ప్రిన్సిపల్ నాగేశ్వరరావు, సరిత, సయ్యద్ షారుఖ్, షేక్ హనీఫ్ వీరు ముందుగా అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది, నాగేశ్వరరావు విద్యార్థులతో మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి మూడు సార్లు భారత ప్రధానమంత్రిగా పనిచేశారని, అటల్ బిహారీ వాజ్పేయి సుపరిపాలనా దినోత్సవం ( గుడ్ గవర్నెన్స్ డే ), మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినమైన డిసెంబర్ 25వ తేదీని భారత ప్రభుత్వం 2014లో సుపరిపాలనా దినంగా ప్రకటించింది, దీని ముఖ్య ఉద్దేశ్యం ప్రభుత్వంలో జవాబుదారీతనం, ప్రజలకు మెరుగైన పాలన అందించడం, మరియు వాజ్పేయి దేశానికి చేసిన సేవలను స్మరించుకోవడం. డిసెంబర్ 23, 2014న, వాజ్పేయి మరియు పండిట్ మదన్ మోహన్ మాలవీయాలకు భారతరత్న ప్రకటించిన సందర్భంలో, డిసెంబర్ 25ను సుపరిపాలనా దినంగా ప్రకటించారు. జన్మదినం: డిసెంబర్ 25, 1924న జన్మించిన అటల్ బిహారీ వాజ్పేయికి నివాళి అర్పిస్తూ ఈ రోజును జరుపుకుంటారు. విద్యార్థులతో ప్రసంగించడం జరిగింది, విద్యార్థులకు క్విజ్ నిర్వహించి అందులో మొదటి మరియు ద్వితీయ నగదు బహుమతులు ఇవ్వడం జరిగింది అనంతరం విద్యార్థులతో ర్యాలీ తీయించడం జరిగింది.

Comment List