#Draft: Add Your Title

మానవసేవే మాధవసేవ అన్న ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్

On
#Draft: Add Your Title

ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో

కొడకండ్ల మండల కేంద్రంలో ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరో మానవతా సేవా కార్యక్రమం నిర్వహించబడింది.
జనగామ జిల్లా, లింగాలఘనపూర్ మండలం, నెల్లుట్ల గ్రామ శివారులో గత కొన్ని సంవత్సరాలుగా కాగితాలు ఏరుకుంటూ జీవనం కొనసాగిస్తున్న నిరుపేద కుటుంబాల పిల్లలు శీతకాలంలో తీవ్ర చలికి ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిన వెంటనే ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ స్పందించింది.
ఈ విషయాన్ని హైదరాబాద్, వివేక్‌నగర్, చిక్కడపల్లి ప్రాంతంలో గోకుల్ కిరణం షాప్ నిర్వహిస్తున్న ప్రొప్రైటర్ పద్మాలయ గోవర్ధన్–హేమాలికి తెలియజేయగా, వారు వెంటనే స్పందించి 30 మంది పిల్లలకు విలువైన బెడ్‌షీట్లు అందజేశారు. ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు ఆ బెడ్‌షీట్లను అరటి పండ్లను పిల్లలకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు శ్రీ పెద్దపూడి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, “స్థిర నివాసం లేక, చిన్న చిన్న గుడిసెల్లో కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్న కుటుంబాల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. చలికాలంలో పిల్లలకు కప్పుకోవడానికి సరైన వస్త్రాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న పిల్లలకు ఎవరి వంతు సహాయం వారు చేయడానికి ముందుకు రావాలి” అని విజ్ఞప్తి చేశారు.
అలాగే, ఇలాంటి నిరుపేద కుటుంబాల పిల్లలకు ఆర్థిక సహాయం, పుస్తకాలు, పెన్నులు, స్కూల్ బ్యాగులు వంటి అవసరమైన వస్తువులు అందించాలనుకునే వారు ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ – 9533211544 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ సభ్యులు వల్లూరి ఉపేందర్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు

Views: 4
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News