తుర్కయంజాల్ మున్సిపాలిటీ ప్రజలకు తీవ్ర అన్యాయం...

మాజీ మున్సిపల్ కౌన్సిలర్, ఫ్లోర్ లీడర్ రమావత్ కళ్యాణ్ నాయక్...

On
తుర్కయంజాల్ మున్సిపాలిటీ ప్రజలకు తీవ్ర అన్యాయం...

తుర్కయంజాల్ మున్సిపాలిటీ ప్రజలకు తీవ్ర అన్యాయం...

మాజీ మున్సిపల్ కౌన్సిలర్, ఫ్లోర్ లీడర్ రమావత్ కళ్యాణ్ నాయక్...

IMG-20251226-WA0813
మాజీ మున్సిపల్ కౌన్సిలర్, ఫ్లోర్ లీడర్ రమావత్ కళ్యాణ్ నాయక్...

రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్మెట్, డిసెంబర్ 27, న్యూస్ ఇండియా ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన జీహెచ్‌ఎంసీ పరిధి విస్తరణలో భాగంగా చేసిన వార్డుల విభజన తుర్కయంజాల్ మున్సిపాలిటీ ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తోందని బీఆర్‌ఎస్ పార్టీ తరపున తుర్కయంజాల్ మున్సిపాలిటీ మాజీ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ తీవ్రంగా ఖండించారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీని శంషాబాద్ డివిజన్‌లో ఆదిభట్ల సర్కిల్‌గా మార్చడం వల్ల మారుమూల గ్రామాల ప్రజలు ఆదిభట్ల, శంషాబాద్‌లకు వెళ్లాలంటే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. తుర్కయంజాల్ ఉనికినే ప్రశ్నార్థకం చేసేలా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తుర్కయంజాల్ మున్సిపాలిటీని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతోనే ఈ విభజనకు పాల్పడిందని ఆరోపించారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఈ మార్పులు జరిగాయని, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నాయకులు ఎదగకుండా రిజర్వేషన్లు లేకుండా చేయాలన్న దురుద్దేశంతోనే వార్డుల విభజన చేశారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం పూర్ణంగా పరిశీలించి తుర్కయంజాల్‌ను నాలుగు వార్డులుగా విభజించి అన్ని వర్గాలకు సమన్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అఖిలపక్ష ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి తమ హక్కులను సాధించుకుంటామని ఆయన హెచ్చరించారు.

Views: 5

About The Author

Post Comment

Comment List

Latest News

తుర్కయంజాల్ మున్సిపాలిటీ ప్రజలకు తీవ్ర అన్యాయం... తుర్కయంజాల్ మున్సిపాలిటీ ప్రజలకు తీవ్ర అన్యాయం...
తుర్కయంజాల్ మున్సిపాలిటీ ప్రజలకు తీవ్ర అన్యాయం... మాజీ మున్సిపల్ కౌన్సిలర్, ఫ్లోర్ లీడర్ రమావత్ కళ్యాణ్ నాయక్... మాజీ మున్సిపల్ కౌన్సిలర్, ఫ్లోర్ లీడర్ రమావత్ కళ్యాణ్...
#Draft: Add Your Title
అటల్ బిహారీ వాజ్పేయి సుపరిపాలనా దినోత్సవం ( గుడ్ గవర్నెన్స్ డే )
విద్యార్థి ఔన్నత్యం తన పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు స్పోర్ట్స్ మెటీరియల్ అందజేత
నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి..
సూర్యతండ గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భుక్యా సక్రి మంగీలాల్
సాతానిగూడెం గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా రెడ్యానాయక్