ముదిరాజుల అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం
ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి నీలం దుర్గేష్ ముదిరాజ్ భారీగా కాంగ్రెస్ లో చేరికలు
మత్స్యకారులను వృద్ధిలోకి తీసుకొస్తున్న ప్రజా ప్రభుత్వం
ముదిరాజుల అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి నీలం దుర్గేష్ ముదిరాజ్ అన్నారు.
ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి దుర్గేష్ ఆధ్వర్యంలో తొర్రూరుతో పాటు జిల్లాలోని ఆయా ప్రాంతాలకు చెందిన 1000 మంది ముదిరాజ్ సామాజిక వర్గ నాయకులు పెద్ద సంఖ్యలో హైదరాబాదులోని గాంధీ భవనంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి సమక్షంలో టిపిసిసి రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అనంతరం డివిజన్ కేంద్రంలో 150 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ముదిరాజుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేయడంతో పాటు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. మత్స్య రంగం అభివృద్ధి కోసం తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. త్వరలోనే పాలకమండలి సైతం ఏర్పాటు అవుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో చెరువులపై పూర్తి హక్కులు మత్స్యకారులకు ఉండే విధంగా చట్టం తెచ్చేందుకు కృషి చేస్తుందన్నారు.
కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన తరువాతనే ముదిరాజుల జీవితాల్లో వెలుగులు వచ్చాయన్నారు. ముదిరాజ్ కులస్తులకు చెరు వుల లైసెన్స్, జీవిత బీమా సౌకర్యం కల్పించిన ఘనత సర్కారుకే దక్కు తుందన్నారు.ముదిరాజ్ లు రాజకీయంగా ఎదిగేందుకు మూడు అసెంబ్లీ స్థానాల్లో టిక్కెట్లను కేటాయించారన్నారు.బీఆర్ఎస్ పార్టీ ముదిరాజ్ లను రాజకీయంగా వాడుకొని ఒక్క అసెంబ్లీ సీటును కూడా ఇవ్వకుండా అవమాన పరిచిందన్నారు.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు చిల్లా సహదేవ్, జెయరాం సర్పంచ్ మారబోయిన వెంకటేశ్వర్లు ముదిరాజ్, చిన్నగూడూరు సర్పంచ్
బత్యం రమేష్ ముదిరాజ్, సింగారం సర్పంచ్ దొంతరబోయిన నరేష్ ముదిరాజ్, జంగలికొండ
సర్పంచ్ గుండెల రేణుక ముదిరాజ్, సూదనపల్లి సర్పంచ్ నీలం వెంకన్న ముదిరాజ్,తోడెలగూడెం సర్పంచ్,కనేగుళ్ల సర్పంచ్ జిల్లా నాయకులు మారబోయిన రాంభద్రం ముదిరాజ్,తోట రమేష్ ముదిరాజ్,గుండెల యాదగిరి,సింగని అశోక్ ముదిరాజ్,గంగారాబోయిన శ్రీనివాస్,తోట రమేష్ ముదిరాజ్,
శీలం సత్యనారాయణ ముదిరాజ్,
బీసు మల్లేశం,కుక్కల ఐలయ్య,
మల్లం యాకయ్య,కనుకుట్ల నరేష్, జిల్లాలోని 18 మండలాల అధ్యక్షులు,సభ్యులు తదితరులు సంఘీభావ ర్యాలీలో పాల్గొన్నారు.

Comment List