అనారోగ్య మరణించిన పీరమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం
పాత లింగాయిపల్లి సర్పంచ్ సిద్దప్ప ఉప సర్పంచ్ నీరుడి రాజయ్య
Jaipal Reporter
న్యూస్ ఇండియా రిపోర్టర్ జైపాల్ జనవరి 02;మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పాత లింగాయి పల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్య కారణాలతో మరణించిన అర్జున్ పీరమ్మ కుటుంబ సభ్యులకు తన వంతు సహాయంగా పాత లింగయ్య పల్లి సర్పంచ్ సిద్ధప్ప గ్రామ ఉప సర్పంచ్ నిరుడు రాజయ్య కాంగ్రేస్ పార్టీ సభ్యులు కార్యకర్తలు 15000 ఆర్ధిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నిమ్మలగారి సిద్ధప్ప మాట్లాడుతూ.. పేద బలహీన వర్గాల వారికి అండగా నిలుస్తామని పేర్కొన్నారు. ఇటీవల అనారోగ్య కారణాలతో మరణించిన అర్జున్ పీరమ్మ అందరితో కలిసిమెలిసి ఉంటూ ఆప్యాయంగా పలకరించే మంచి వ్యక్తి వీరమ్మను కోల్పోయినమని అన్నారు. వారి ఆత్మ చేకూరాలని సర్పంచ్ సిద్ధప్ప తెలిపారూ. ఈ కార్యక్రమంలో కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు ఇట్టబోయిన దస్తయ్య, సెక్రటరీ మాదగల్ల సిద్దిరాములు, వార్డు మెంబర్లు మాదగాళ్ల రామరాజు, ఇట్టబోయిన రాములు, పెద్దోళ్ల రవికుమార్, కార్యకర్తలు బెస్త యాదగిరి, లక్ష్మపురం మల్లేశం, పట్లోళ్ళ ఉమాకాంత రెడ్డి, నిమ్మళగారి రవి, నిమ్మళగారి సాయిబాబా, మాదగల్ల సాయిలు, భూపతి సాయిబాబా, చింతకాయల రమేశ్ ,భూపతి బ్రహ్మం,తుమ్మల దస్తయ్య, బెస్త ప్రవీణ్, పెద్దోళ్ల దుర్గయ్య, భూపతి రమేష్, నీరుడి భాగయ్య, కలాలి సాయగౌడ్,చింతకాయల రాజేందర్, మాదగల్ల శేఖర్, తుమ్మల రమేశ్, నీరుడి బ్రహ్మం ,చింతకాయల భూమయ్య తదితరులు పాల్గొన్నారు.

Comment List