వృద్ధులకు ఫ్రెండ్లీ కేర్ భద్రత భరోసా

ప్రసన్న కుమార్ ఫ్రెండ్లీ కేర్ చేతుల మీదుగా

On

వృద్ధుల ఫ్రెండ్లీ కేర్ భద్రత భరోసా
సీతారామపురం వృద్ధాశ్రమంలో ఇనుప పెట్టెల పంపిణీ
దేవరుప్పుల మండలం సీతారామపురంలో ఉన్న వృద్ధాశ్రమంలో నివసిస్తున్న వృద్ధుల అవసరాలను గుర్తించి, మహాత్మ హెల్పింగ్ హాండ్స్ సహకారంతో, ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విలువైన వస్తువులు భద్రపరచుకునేందుకు ఉపయోగపడే ఇనుప పెట్టెలను ఈ రోజు పంపిణీ చేశారు.
వృద్ధాశ్రమంలో నివసిస్తున్న సుమారు 15 మంది వృద్ధులకు తమ విలువైన పత్రాలు, డబ్బు మరియు ఇతర అవసరమైన వస్తువులను సురక్షితంగా దాచుకునేందుకు సరైన పెట్టెలు లేవని తెలిసిన వెంటనే, ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ అధ్యక్షులు పెదపూడి ప్రసన్న కుమార్ ఈ విషయాన్ని మహాత్మ హెల్పింగ్ హాండ్స్ అధ్యక్షులు గంట రవీందర్ దృష్టికి తీసుకెళ్లారు.
అడిగిన వెంటనే స్పందించిన గంట రవీందర్ గారు, తన సొంత ఖర్చులతో ఇనుప పెట్టెలను ఏర్పాటు చేసి వృద్ధాశ్రమానికి పంపించడం విశేషం. ఆయన సేవా భావానికి గుర్తుగా ఈ రోజు ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ సభ్యులు వృద్ధాశ్రమానికి చేరుకొని పెట్టెలను వృద్ధులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ అధ్యక్షులు పెదపూడి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ,
“మా గురువు గారైన గంట రవీందర్ గారి సేవా ప్రేరణతోనే ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ ఏర్పడింది. ఆయన మానవత్వం, సేవా తత్వమే మా సంస్థకు మార్గదర్శకం. వృద్ధుల భద్రత కోసం చేసిన ఈ సహాయం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది” అని తెలిపారు.
వృద్ధులు కూడా ఈ సందర్భంగా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, తమ అవసరాన్ని గుర్తించి సహాయం చేసిన మహాత్మ హెల్పింగ్ హాండ్స్, ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.,

Views: 5
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

వృద్ధులకు ఫ్రెండ్లీ కేర్ భద్రత భరోసా వృద్ధులకు ఫ్రెండ్లీ కేర్ భద్రత భరోసా
వృద్ధుల ఫ్రెండ్లీ కేర్ భద్రత భరోసాసీతారామపురం వృద్ధాశ్రమంలో ఇనుప పెట్టెల పంపిణీదేవరుప్పుల మండలం సీతారామపురంలో ఉన్న వృద్ధాశ్రమంలో నివసిస్తున్న వృద్ధుల అవసరాలను గుర్తించి, మహాత్మ హెల్పింగ్ హాండ్స్...
అనారోగ్య మరణించిన పీరమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం
ముదిరాజుల అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం
నూతన సంవత్సర వేడుకల వేళ.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..
తుర్కయంజాల్ మున్సిపాలిటీ ప్రజలకు తీవ్ర అన్యాయం...
#Draft: Add Your Title
అటల్ బిహారీ వాజ్పేయి సుపరిపాలనా దినోత్సవం ( గుడ్ గవర్నెన్స్ డే )