వ్యభిచార అడ్డాగా హర్షిత గెస్ట్ హౌస్‌… యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ దాడులు..

On
వ్యభిచార అడ్డాగా హర్షిత గెస్ట్ హౌస్‌… యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ దాడులు..

వ్యభిచార అడ్డాగా హర్షిత గెస్ట్ హౌస్‌… యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ దాడులు..

Screenshot_2026-01-08-18-59-34-66_c2c39eb77ce131054e1b7fd47705651e
వ్యభిచార అడ్డాగా హర్షిత గెస్ట్ హౌస్‌… యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ దాడులు..

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన..

రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, జనవరి 08, న్యూస్ ఇండియా ప్రతినిధి: వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని కమ్మగూడలో ఉన్న హర్షిత గెస్ట్ హౌస్ వ్యభిచార అడ్డాగా మారింది. గెస్ట్ హౌస్‌లో అక్రమంగా వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం అధికారులు నిన్న సాయంత్రం మెరుపుదాడి నిర్వహించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన యువతులను హైదరాబాద్‌కు తీసుకొచ్చి వ్యభిచారానికి పాల్పడుతున్నట్టు సమాచారం అందడంతో అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకుని వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. హర్షిత గెస్ట్ హౌస్ సిబ్బంది ఖలీల్ అనే వ్యక్తిని కూడా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న విలేకరులు సంఘటన స్థలానికి చేరుకుని వీడియోలు చిత్రీకరిస్తుండగా గెస్ట్ హౌస్ ఓనర్ అక్కడికి చేరుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. “మీరు ఎవరు? ఇక్కడ ఎందుకు వచ్చారు?” అంటూ విలేకరులను భయబ్రాంతులకు గురిచేస్తూ ప్రతివీడియో రికార్డు చేసినట్టు తెలుస్తోంది. గెస్ట్ హౌస్‌లో జరిగిన దాడులపై వివరణ కోరినా ఓనర్ సమాధానం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో స్థానికంగా కలకలం రేగింది. గెస్ట్ హౌస్‌ల ముసుగులో జరుగుతున్న అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది.

Views: 3

About The Author

Post Comment

Comment List

Latest News

వ్యభిచార అడ్డాగా హర్షిత గెస్ట్ హౌస్‌… యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ దాడులు.. వ్యభిచార అడ్డాగా హర్షిత గెస్ట్ హౌస్‌… యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ దాడులు..
వ్యభిచార అడ్డాగా హర్షిత గెస్ట్ హౌస్‌… యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ దాడులు.. వ్యభిచార అడ్డాగా హర్షిత గెస్ట్ హౌస్‌… యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ దాడులు.. ఆలస్యంగా వెలుగులోకి...
వృద్ధులకు ఫ్రెండ్లీ కేర్ భద్రత భరోసా
అనారోగ్య మరణించిన పీరమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం
ముదిరాజుల అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం
నూతన సంవత్సర వేడుకల వేళ.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..
తుర్కయంజాల్ మున్సిపాలిటీ ప్రజలకు తీవ్ర అన్యాయం...
#Draft: Add Your Title