డీలర్ గారు… సర్పంచ్‌గా గెలిచారా?!

అయితే వెంటనే రాజీనామా చేయాలి..!

On
డీలర్ గారు… సర్పంచ్‌గా గెలిచారా?!

ప్రజా పంపిణీ వ్యవస్థకు ఉన్న ప్రతిష్ట ఎంత గొప్పదో రేషన్‌ డీలర్లు సర్పంచ్‌ ఎన్నికల్లో గెలవడం ద్వారా మరోసారి రుజువైందని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్‌మెంట్‌ డీటీ మాచన రఘునందన్‌ అన్నారు.

డీలర్ గారు… సర్పంచ్‌గా గెలిచారా?!

అయితే వెంటనే రాజీనామా చేయాలి..!

పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్‌మెంట్ డీటీ మాచన రఘునందన్ స్పష్టం..

IMG-20260112-WA0672
పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్‌మెంట్ డీటీ మాచన రఘునందన్ స్పష్టం..

రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం, జనవరి 12, న్యూస్ ఇండియా ప్రతినిధి: ప్రజా పంపిణీ వ్యవస్థకు ఉన్న ప్రతిష్ట ఎంత గొప్పదో రేషన్‌ డీలర్లు సర్పంచ్‌ ఎన్నికల్లో గెలవడం ద్వారా మరోసారి రుజువైందని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్‌మెంట్‌ డీటీ మాచన రఘునందన్‌ అన్నారు. రేషన్‌ డీలర్లు తమ సేవల ద్వారా ప్రజల ఆదరణ పొందుతూ, ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావడం ‘డీలర్‌ సత్తా’కు నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు. సోమవారం ఇబ్రహీం పట్నంలో ఆయన మాట్లాడుతూ… కొందరు రేషన్‌ డీలర్లు సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించడం ఆహ్వానించదగిన పరిణామమన్నారు. అయితే, సర్పంచ్‌గా ఎన్నికైన తర్వాత కూడా రేషన్‌ డీలర్‌గా కొనసాగడం నియమ నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం రాజకీయ పార్టీల మద్దతుతో ఎన్నికల్లో పోటీ చేసిన రేషన్‌ డీలర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేయాల్సిందేనని రఘునందన్‌ తేల్చిచెప్పారు. రాజీనామా చేయని పక్షంలో సంబంధిత డీలర్‌షిప్‌ రద్దుకు సిఫారసు చేయడం తప్పదని హెచ్చరించారు. సర్పంచ్‌గా ఎన్నికై కూడా డీలర్‌గా కొనసాగాలన్న ఆలోచన నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. రేషన్‌ డీలర్‌షిప్‌ అనేది కేవలం ఉపాధి మాత్రమే కాకుండా గౌరవప్రదమైన బాధ్యత అని, అందుకే డీలర్లకు సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభించిందని తెలిపారు. సర్పంచ్‌లుగా ఎన్నికైన డీలర్లు తక్షణమే రాజీనామా సమర్పిస్తే, ఆ చౌకధర దుకాణాల నిర్వహణను తాత్కాలికంగా ఇతరులకు అప్పగించి, అనంతరం నిబంధనల ప్రకారం అర్హులైన వారికి పరీక్ష ద్వారా కేటాయిస్తామని రఘునందన్‌ వెల్లడించారు.

Read More వ్యభిచార అడ్డాగా హర్షిత గెస్ట్ హౌస్‌… యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ దాడులు..

Views: 10

About The Author

Post Comment

Comment List

Latest News